కపిల మహర్షి

వికీపీడియా నుండి
08:11, 2 జూలై 2024 నాటి కూర్పు. రచయిత: 103.197.112.252 (చర్చ)
(తేడా) ←పాత కూర్పు | ప్రస్తుతపు కూర్పు చూపించు (తేడా) | దీని తరువాతి కూర్పు→ (తేడా)
Jump to navigation Jump to search
పీట మీద కూర్చున్న కపిల మహర్షి - 19వ శతాబ్దం నాటి వర్ణచిత్రం

కపిల మహర్షి (హిందీ: कपिल ऋषि) వేద కాలపు హిందూ మహాముని.[1] ఇతని గురించి శ్రీమద్భాగవతంలో సాంఖ్య శాస్త్రంలోని ప్రాథమిక సూత్రాలను రచయితగా పేర్కొన్నది.[2] ఇవి సాంఖ్య గ్రంథముగా లభ్యమవుతునాయి. దీనిని సాంఖ్య కారిక అని అంటారు. దీనిలో 7 విభాగాలు ఉన్నాయి.[3] దీనికి ఉన్న అనుబంధాలు, వ్యాఖ్యానాలతో కలిపి ఇది ఆరు అధ్యాయాలుగా విస్తరించింది. కాలంతో పాటు దీనికి అనేక వ్యాఖ్యానాలు వ్రాయటం జరిగింది. దీనికి ఉదాహరణ అనిసరుద్ధుడు రచించిన కపిల సాంఖ్య ప్రవచన సూత్ర వృత్తి .[4]

మహాభారతంలో పేర్కొన్నట్లుగా, ఇతడు ఏడుగురు బ్రహ్మ మానస పుత్రులలో ఒకరు. ఇతరులు అనిరుద్ధుడు, సనత్కుమారులు.[5] విష్ణు పురాణంలో ఇతన్ని మహావిష్ణువు యొక్క అవతారంగా పేర్కొనబడినది.[6] ఇతడు భక్తి యోగంలో ముక్తిని సాధించే ప్రక్రియను బోధించే గురువుగా ప్రసిద్ధులు.

కపిలముని జీవితం గురించిన చాలా వివరాలు శ్రీ మధ్భాగవతంలోని 3వ స్కంధము 33వ అధ్యాయము అయిన కపిలుని రచనలలో లభ్యమౌతున్నాయి,[2] ఇందులో ఉన్న వివరాల ప్రకారం - అతని తల్లి తండ్రుల పేర్లు కర్దమ ముని, దేవహూతి. తన తండ్రి ఇల్లు వదలి వెళ్ళిన తరువాత కపిలముని తన తల్లి అయిన దేవ హూతికి యొగ శాస్త్రాన్ని అభ్యసించమని విష్ణువుని ప్రార్థించమని, వాటి వలన దేవుని యెడల నిజమైన భక్తి మోక్షము కలుగుతాయని సలహా ఇచ్చాడు.[7]

గంగావతరణం

[మార్చు]
గంగావతరణం - రాజా రవివర్మ చిత్రం

సూర్యవంశపు రాజైన సగరునకు వర ప్రభావం వలన మొదటి భార్యకు మహాతేజోవంతుడైన అసమంజసుడు, రెండవ భార్యకు చిన్న చిన్న తిత్తులతో కూడిన పిండం ప్ర్రసవింపబడింది, ఆ పిండానికి వున్న తిత్తులను దాదులు 60 వేల నేతికుండలలో భద్రపరచగా( పొదగడం ) 60 వేల మంది కుమారులు కలిగిరి వీరు ప్రత్యేక నామాలతో కాక సగరులుగా ప్రసిద్ధి చెందారు. కాని పెద్దవాడైన అసమంజశుడు తనతోపాటు ఆడుకోవదడానికి వచ్చే పిల్లలను సరయు నదిలో తోసివేయడం లేక వారి కొనప్రాణం వరకు నీటిలో ముంచి వారు తమ ప్రాణాలను కోసం పడే నరకయాతనను చూసి సంతోషపడే వాడు. ఇది తెలిసిన ప్రజానీకం రాచబిడ్డడు అనే ఉద్దేశ్యంతో రాజుగారికి చెప్పుటకు భయపడుతుండే వారు. కానీ ఎంత వయసు వచ్చినా అంశుమంతుడి ప్రవర్తనలో ఎలాంటిమ మార్పు రాకపోయేసరికి భరించలేని ప్రజలు అంసుమంతుడి ఆగడాల గురించి మహారాజుకు తెలియజేయడంతో రాజు తన కొడుకుకి రాజ్య బహిష్కారం శిక్ష విధించాడు. ఆ తరువాత మహారాజు తన రాజ్యా విస్తరణ కొరకు తన 60 వేల మంది పుత్రులే తనకు ఒక సేనలా అగుపించగా తాను మహర్షుల అనుమతి మేరకు అశ్వమేధ యాగాన్ని చేయ సంకల్పించి యాగాశ్వమును విడిచిపెట్టెను. యాగాశ్వ రక్షణకు తన కుమారులను పంపి తాను యాగ కంకణధారి అయి వుండెను. కాని మహారాజు ఈ అశ్వమేధ యాగాల పుణ్యఫలంతో తన ఇంద్రపదవికి ఎక్కడ పోటీ వస్తాడేమొనని భయపడిన ఇంద్రుడు యాగం భగ్నం చేయడానికి యాగాశ్వమును పాతాళంలో లోని కపిల మహర్షి ఆశ్రంమంలో దాచాడు. యాగపశువు కనిపించక పోవడంతో ఆ అశ్వానికి రక్షణగా వెళ్ళిన సగరుని 60 వేల మంది పుత్రులు భూ మండలమంతా గాలించిననూ యగాశ్వపు ఆచూకి దొరకకపోవడంతో ఇంటిముఖం పట్టగా, తండ్రి అయిన సగర చక్రవర్తి ఆదేశాల మేరకు వారు పాతాళంలో వెతుకుట కొరకు భూమి పై అనేక గుంతలను తీసి పాతాళ ప్రవేశం చేశారు కాని వీరి అత్యుత్సాహం భూదేవికి కడు ఖేదం కలిగించింది. కానీ తదుపరి కాలంలో ఈ గుంతలలో జలములు చేరి సగరుల పేరిట సాగరమైంది. పాతాళంలో వెతుకుతున్న సగరులకు కపిల మహర్షి ఆశ్రమంలో యాగాశ్వం కనిపించడంతో ఇతను ఏవరో మాయోపాయంతో తమ యాగాశ్వమును తస్కరించి వుంటాడని భావించిన వారై క్రుద్దులై కపిల మహర్షి పైకి ఉరికిరి. ఈ అలజడికి ధ్యాన సమాధి నుండి మేల్కోన్న మహర్షి తనపైకి వస్తున్న సగరుల వంక చూసి ఒక్క హుంకారం చేసెను. అంతట మహర్షి కోపాగ్నికి 60 వేలమంది సగరులు భస్మమై 60 వేల బూడిదకుప్పలై పోయారు. యాగాశ్వము కొరకు వెళ్ళిన తన పితామహులు ఎంతకీ తిగిగ రాకపోవడంతో యాగ పరిసమాప్తి కాక మధనపడుతున్న సగరునితో అసమంజసుని మనవడు ఆంశుమంతుని కొడుకు సగర కుల్భవుడు అయిన భగీరధుడు యాగాశ్వమును వెతుకుతూ పాతాళం చేరి వారికి ఉత్తమగతులు లభించాలంటే దివిజ గంగను పాతాళానికి తేవలసి ఉంది. సగరుడు, అతని కొడుకు అసమంజసుడూ తపసు చేసినా ప్రయోజనం లేకపోయింది.

భగీరధుడు తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని గంగకోసం తపస్సు చేశాడు. గంగ ప్రత్యక్షమై "నేను భూమి మీదికి దిగిరావడానికి సిద్ధంగా ఉన్నాను. కాని నా దూకుడు భరించగల నాధుడెవ్వరు?" అని అడిగింది. భగీరధుడు శివుని కోసం తపసు చేశాడు. అనుగ్రహించిన శివుడు గంగను భువికి రాగానే తన తలపై మోపి, జటాజూటంలో బంధించాడు. భగీరధుని ప్రార్ధనతో ఒక పాయను నేలపైకి వదలాడు. భగీరధుని వెంట గంగ పరుగులు తీస్తూ సాగింది. ఆపై సాగరంలో ప్రవేశించి, పాతాళానికి చేరి, సగరుని పుత్రులకు ఉత్తమ గతులను కలుగజేసింది.

మూలాలు

[మార్చు]
  1. బులుసు, వేంకటేశ్వర్లు (1992). మహర్షుల చరిత్రలు (మొదటి భాగము). తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానము. p. 69.
  2. 2.0 2.1 Chapter 33: Activities of Kapila Archived 2010-01-26 at the Wayback Machine Srimad Bhagavatam, Canto 3, Chapter 33: Activities of Kapila. SB 3.33.1: Śrī Maitreya said: Thus Devahūti, the mother of Lord Kapila and wife of Kardama Muni, became freed from all ignorance concerning devotional service and transcendental knowledge. She offered her obeisances unto the Lord, the author of the basic principles of the Sāńkhya system of philosophy, which is the background of liberation, and she satisfied Him with the following verses of prayer." Bhaktivedanta VedaBase Network.
  3. A Tribute To Maharishi Kapila Archived 2009-03-04 at the Wayback Machine Secret Of Sankhya: Acme Of Scientific Unification. p. 42.
  4. The Sánkhya Aphorisms of Kapila translated by James R. Ballantyne, 1885.
  5. Vaisampayana continued... The Mahabharata translated by Kisari Mohan Ganguli (1883 -1896), Book 12: Santi Parva, Part 3, Section: CCCXLI. p. 147 "The puissant Lord who is charged with the creation of all the worlds is called Aniruddha, Sana, Sanatsujata, Sanaka, Sanandana, Sanatkumara, Kapila, and Sanatana numbering the seventh,--these seven Rishis are known as the spiritual sons of Brahman. Their knowledge comes to them of itself (without being dependent on study or exertion). These seven are wedded to the religion of Nivritti. They are the foremost of all persons conversant with Yoga. They are possessed also of deep knowledge of the Sankhya philosophy. They are preceptors of the scriptures on duty and it is they that introduce the duties of the religion of Nivritti, and cause them to flow in the worlds.
  6. Parashara... Vishnu Purana translated by Horace Hayman Wilson, 1840. Book II: Chapter XIV. p. 106. "..a portion of the mighty and universal Vishnu..
  7. Śrīmad Bhāgavatam Archived 2008-08-22 at the Wayback Machine Srimad Bhagavatam 3.33.30 - My dear Vidura, by following the principles instructed by Kapila, Devahūti soon became liberated from material bondage, and she achieved the Supreme Personality of Godhead, as Supersoul, without difficulty."

బయటి లింకులు

[మార్చు]