కళ్యాణ్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
కళ్యాణ్ లోకసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | మహారాష్ట్ర |
అక్షాంశ రేఖాంశాలు | 19°12′0″N 73°6′0″E |
కళ్యాణ్ లోక్‌సభ నియోజకవర్గం (Kalyan Lok Sabha constituency) మహారాష్ట్రలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఇది కొత్తగా ఏర్పడింది. 2009లో తొలిసారిగా ఇక్కడ జరిగిన ఎన్నికలో శివసేన పార్టీకి చెందిన ఆనంద్ పరంజపే విజయం సాధించాడు.
నియోజకవర్గంలోని సెగ్మెంట్లు
[మార్చు]విజయం సాధించిన అభ్యర్థులు
[మార్చు]- 2009: ఆనంద్ పరంజపే (శివసేన పార్టీ)
2009 ఎన్నికలు
[మార్చు]2009లో జరిగిన ఎన్నికలలో శివసేనకు చెందిన ఆనంద్ పరంజపే తన సమీప ప్రత్యర్థి ఎన్సీపీకి చెందిన వసంత్ దవ్ఖారేపై 24,202 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. ఆనంద్‌కు 2,12,476 ఓట్లు రాగా, వసంత్‌కు 1,88,274 ఓట్లు లభించాయి. ఎంఎన్సీ అభ్యర్థి వైశాలి దారేకర్‌కు 1,02,063 ఓట్లు లభించాయి.