కుక్క

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పెంపుడు కుక్క
Temporal range: Late Pleistocene - Recent
other images of dogs
పెంపుడు జంతువు
Scientific classification
Domain:
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Genus:
Species:
Subspecies:
కే. లూ. ఫెమిలియారిస్
Trinomial name
కేనిస్ లూపస్ ఫెమిలియారిస్
మూడు కుక్కపిల్లలు - విశాఖపట్నంలో

కుక్క (ఆంగ్లం Dog) మానవుడు మచ్చిక చేసుకున్న మొట్టమొదటి జంతువు. ఇది ఒక క్షీరదం. సుమారు 14,000 సంవత్సరాల కిందటే ఇది మనిషితో కలిసి జీవించడం నేర్చుకుంది. డెన్మార్క్, జెర్మనీ, చైనా, జపాన్ దేశలలో దొరికిన పురాతన అవశేషలను పరిశీలిస్తే, కుక్కకు ఆ రోజుల్లో ఉన్న ప్రాముఖ్యత అర్థమౌతుంది.కుక్కలు అత్యంత నమ్మకంగల జంతువు.భారత్ లో కుక్కను కాలభైరవుడు అను నామంతో దైవంగా భావించెదరు. వారణాసిలో కాలభైరవ గుడి కూడా ఉంది.

విశేషాలు

కుక్క ఇంకా మనిషి ఎలా మొదట సహజీవనం సాగించడం నేర్చుకున్నారో తెలియనప్పటికీ, మనిషి మాత్రం చాలా త్వరగా కుక్క తన జీవనాన్ని ఎలా మెరుగుపరచగలదో తెలుసుకున్నాడు. కుక్కలను జంతువులను వేటాడడానికి, పశువులకు, ఇళ్ళకు కాపలాగా, ఎలుకలు, ఇతర హానికర జీవాలను తొలగించడానికి, బండ్లను లాగడానికి, ఇంకా చెప్పాలంటే తప్పుచేసిన వారిని శిక్షించడానికి కూడా వాడుకునేవారు. ప్రస్తుతం కుక్కలను పోలీసులు వివిధ పనుల్లో వాడతారు. కాని కుక్క ఎప్పుడూ మనిషికి ఒక నేస్తం లాంటిదే. కుక్కలు తమ యజమానులను ప్రేమిస్తాయి. మానవులు కూడా కుక్కలతో విడదీయరాని సంబంధం ఏర్పరుచుకుంటారు. ఇంకా చెప్పాలంటే కుక్క గురించి ఒక చిన్న కథ కుడా ఉంది.కడప జిల్లాలోని గండికొవ్వూరు గ్రామంలో ఒక యజమాని ఒక కుక్కను చిన్నతనం నుంచి పెంచాడు.దానికి విశ్వాసంగా తన యజమాని చనిపోయిన తరువాత అతని సమాధి వద్ద వారం రోజుల పాటు వుండి తన ప్రాణాలను అక్కడే వదిలింది.

కుక్కల lakshanalu

సాదారణ జాతులు

ఖరీదైన జాతులు

ఒక జాతి కుక్క
Dog at araku

ఇక్కడికి గెంతు: పేజీకి సంబంధించిన లింకులు, అన్వేషణ

కుక్కకాటు

మున్సిపాలిటీలు, పశుసంవర్థక శాఖ నిర్లక్ష్యం, కారణంగానే ఇంటి బయట ఆడుకునే చిన్నారులు, వీధినపోయే పెద్దలు కుక్కకాటుకు బలవుతున్నారని ఇంట్లో పడుకుని ఉండగా పిచ్చికుక్కలు ఇంట్లోకి ప్రవేశించి గాయపరుస్తున్నాయని, వీధి కుక్కలను నియంత్రించడానికి ప్రత్యేకంగా రూపొందించిన 2007-డాగ్‌ రూల్స్‌ అమలు సక్రమంగా జరగడం లేదనీ, దాంతోనే వీధి కుక్కలు నగరంలో వీరంగాన్ని సృష్టిస్తున్నాయని, భవిష్యత్తులో మరిన్ని మరణాలు సంభవించకుండా ప్రజలను వీధి కుక్కల బారి నుంచి కాపాడాలని జంతు సంక్షేమ సంఘం ఆరోపిస్తూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్‌ దాఖలు చేసింది. (ఈనాడు8.11.2009)

కుక్కలపై తెలుగులో కల సామెతలు

  • మొరిగే కుక్క కరవదు
  • కుక్క తోకను పట్టు కొని గోదావరి ఈదినట్లు
  • కుక్క కాటుకు చెప్పు దెబ్బ
  • కుక్క తోక వంకర
  • ప్రతి కుక్కకూ తనదైన ఒక రోజు ఉంటుంది
  • కుక్క మూతి పిందెలు
  • మాటలు నేర్చిన కుక్కను ఉస్కో అంటే అది కూడా ఉస్కో అన్నదట.

ఇవి కూడా చూడండి

చిత్రమాలిక

యితర లింకులు

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.