Jump to content

జన సాంద్రత

వికీపీడియా నుండి
04:40, 17 ఫిబ్రవరి 2023 నాటి కూర్పు. రచయిత: Chaduvari (చర్చ | రచనలు)
(తేడా) ←పాత కూర్పు | ప్రస్తుతపు కూర్పు చూపించు (తేడా) | దీని తరువాతి కూర్పు→ (తేడా)
2006, దేశాలవారీ జనసాంద్రత.
1994 లో జనసాంద్రత, ప్రపంచ పటం.

జనసాంద్రత (ఆంగ్లంలో Population density) ఒక, జనాభా కొలమాన విధానం. ఒక చదరపు కిలోమీటరు ప్రాంతంలో నివసించే జనాభాను జనసాంద్రతగా పరిగణిస్తారు.[1]

మానవ జనాభా సాంద్రత

[మార్చు]
హాంకాంగ్ లోని ఒక వీధిలో జనాభా రద్దీ, ప్రపంచంలోని అత్యధిక జనసాంద్రతగల ప్రాంతాలలో ఒకటి.

మానవులలో, జనసాంద్రత, ఒక యూనిట్ (ఉదాహరణకు ఒక చదరపు కిలోమీటరు) తీసుకుని, దానిలో నివసించు జనాభాను తీసుకుని, సరాసరి గణిస్తారు. దీనిని, ప్రపంచం, ఖండం, దేశం, రాష్ట్రం, నగరం, ఇతర విభాగాల వారీగా గణిస్తారు.

  • ప్రపంచ జనాభా 6.6 బిలియన్ ప్రజలు, భూమి వైశాల్యం 510 మిలియన్ చ. కి., (200 మిలియన్ చదరపు మైళ్ళు).
  • ఈ రీతిలో, జనాభా / విస్తీర్ణం (వైశాల్యం); 6.6 బిలియన్లు / 510 చదరపు కి.మీ. = 13 మంది జనాభా ఒక చదరపు కి.మీ.నకు (ఒక చదరపు మైలుకు 33 మంది)
  • లేదా భూమిపై గల భూభాగాన్ని లెక్కగట్టితే భూభాగం 150 మిలియన్ కి.మీ.² ఈ లెక్కన ఒక చదరపు కి.మీ.నకు 43 మంది జనాభా (ఒక చదరపు మైలుకు 112 మంది).
  • జనాభా పెరుగుదలతో జనసాంద్రతకూడా పెరుగుతుంది.

ఇతర కొలమాన విధానాలు

[మార్చు]
  • జనాభా సాంద్రత కొలవడానికి, గణిత సాంద్రత విధానము సాధారణమైనది, కానీ కొన్ని ఇతర విధానాల ద్వారా కూడా, ఓ నిర్ణీత ప్రదేశంలో జనసాంద్రత కొలుస్తారు.
  • గణిత సాంద్రత: మొత్తం ప్రజలు / ప్రాంత వైశాల్యం కి.మీ² లేదా మై.².
  • భూమి మీద జనాభా సాంద్రత: మొత్తం జనాభా / లభ్యమవుతున్న భూమి.
  • వ్యవసాయ సాంద్రత: మొత్తం గ్రామీణ జనాభా / మొత్తం వ్యవసాయ భూమి.
  • నివాసాల సాంద్రత: పట్టణ ప్రాంతాలలో నివసించు జనాభా / నివాసయోగ్యమైన భూమి.
  • పట్టణ సాంద్రత: పట్టణ ప్రాంతంలో నివసించు జనాభా / మొత్తం పట్టణ ప్రాంతం.
  • ఉత్తమమైన పర్యావరణ: ప్రాంతీయ సహజవనరుల ఆధారంగా గల జనసాంద్రత.

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Population Density Information and Statistics".

ఇతర లింకులు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]