గుడ్డు
చాల పక్షులు, సరీసృపాలు గుడ్లు (ఆంగ్లం: Eggs) పెడతాయి. గుడ్డు (లాటిన్ ovum) నిజంగా అండాలు ఫలదీకరణం తర్వాత ఏర్పడే జైగోట. గుడ్లు ఒక నిర్ధిష్టమైన ఉష్ణోగ్రత దగ్గర పొదగబడి కొంతకాలం తర్వాత పిండం తయారౌతుంది. ఈ పిండం కొంత పరిణతి సాధించిన తర్వాత గుడ్డును పగులగొట్టుకొని బయటికి వస్తుంది.
గుడ్లు పెట్టే జంతువులను ఓవిపారస్ జంతువులు అంటారు. ఈ జంతువులలో పిండాభివృద్ధి జీవి శరీరం లోపల కాకుండా బయటే జరుగుతుంది. The study or collecting of eggs, particularly bird eggs, is called oology.
సరీసృపాలు, పక్షులు గుడ్లు నీటి బయట పెట్టి నప్పుడు వానికి రక్షణ కోసం కవచం వంటి పెంకు ఉంటుంది. ఇది మెత్తగా కాని లేదా గట్టిగా కాని ఉంటుంది. ఇలా ప్రత్యేకమైన పొరను కలిగి ఉండడం క్షీరదాలలో ఉల్బదారులు లక్షణము.
నిప్పుకోడి గుడ్డు అన్నింటి కన్నా పెద్దవి; ఇవి సుమారు 1.5 కి.గ్రా. బరువుంటాయి. అతి చిన్న పక్షి గుడ్లు అరగ్రాము బరువు కూడా ఉంటాయి. వీటి కన్నా సరీసృపాలు, చేపలు పెట్టే సాధారణంగా చిన్నవిగా ఉంటాయి. అయితే కీటకాలు, ఇతర అకశేరుకాల గుడ్లు ఇంకా చిన్నవిగా ఉంటాయి.
పక్షి గుడ్లు
[మార్చు]పక్షులు తమ గుడ్లను పొదుగుతాయి. ఈ పొదిగే కాలం జాతిని బట్టి మారుతుంది. సాధారణంగా ఒక గుడ్డు ఉండి ఒక పిల్ల వస్తుంది. కొన్ని పక్షులు ఫలదీకరణం చెందకుండా గుడ్లు పెడతాయి. ఇలాంటి గుడ్లు నుండి పిల్లలు ఉత్పత్తి కావు.
రంగులు
[మార్చు]సకశేరుకాల గుడ్లు వానిలోని కాల్షియం కార్బొనేట్ మూలంగా సామాన్యంగా తెలుపు రంగులో ఉంటాయి. కానీ కొన్ని రకాల పాటలు పాడే పక్షులు రంగుల గుడ్లను పెడతాయి. వాటిలోని వర్ణ పదార్ధాల మూలంగా రంగులు కలుగుతాయి. బిలివర్డిన్ మూలంగా ఆకుపచ్చ, జింక్ సమ్మేళనాల మూలంగా నీలం రంగు, ప్రోటోపార్ఫిరిన్ మూలంగా ఎరుపు లేదా గోధుమ రంగులు కలుగుతాయి. పక్షులలో కాల్షియం లోపించినప్పుడు గుడ్లలోని పెంకు పలుచగా గాని లేదా ఒక వైపు మెత్తగా ఉంటాయి. ఈ రంగు పదార్ధాలు చివరలో కాకుండా మొత్తం పెంకు తయారౌతున్న కాలం అంతా చేర్చబడతాయి.
గుడ్డు యొక్క రంగు జన్యుపరంగా నిర్దేశించబడుతుంది. ఇది తల్లి నుండి, W క్రోమోజోము (ఆడ పక్షులు- WZ, మగ పక్షులు- ZZ) ద్వారా సంక్రమిస్తుంది.
పెంకు
[మార్చు]పక్షుల గుడ్లలో కంటికి కనిపించని సన్నని రంధ్రాలుంటాయి. ఇవి పిండం శ్వాసక్రియకు తోడ్పడతాయి. సాధారణ కోడిగుడ్డులో సుమారు 7.500 రంధ్రాలుంటాయి.
పక్షి గుడ్లు వివిధ రకాలుగా ఉంటాయి.
- cormorant eggs are rough and chalky
- tinamou eggs are shiny
- duck eggs are oily and waterproof
- cassowary eggs are heavily pitted
ఆకారాలు
[మార్చు]చాల పక్షుల గుడ్లు అండాకారంలో ఉంటాయి. వీనికి ఒక వైపు గుండ్రంగా రెండవ వైపు కొద్దిగా మొనదేలి ఉంటాయి. ఈ ఆకారం అండనాళం ద్వారా బహిర్గతమైనందువలన కలుగుతుంది. ఈ నాళం చివరనుండే కండరాలు సంకోచించడం వలన గుడ్లు బయటకు పంపబడతాయి. గుడ్డు ఇంకా మెత్తగా ఉండటం వల్ల ఈ ఆకారం వస్తుంది. మొనదేలిన భాగం చివరలో వస్తుంది. కొండ చరియల్లో గూడు కట్టుకొనే పక్షుల గుండ్లు పొడవుగా శంకు ఆకారంలో ఉంటాయి. చాలా వరకు రంధ్రాలలో గూడు కట్టుకొనే పక్షుల గుడ్లు ఇంచుమించు గుండ్రంగా ఉంటాయి.
Predation
[మార్చు]చాలా జంతువులు గుడ్లను తింటాయి. వీనిలో ముఖ్యమైనవి నీటి కుక్కలు, నక్కలు, కాకులు ముఖ్యమైనవి. చాలా వరకు పాములు పక్షి గుడ్లను దొంగిలించి తినడంలో జాగ్రత్త వహిస్తాయి.
కొన్ని పక్షులు ఇతర జాతి పక్షులు కట్టిక గూడులలో గుడ్లు పెడతాయి. కొన్ని సందర్భాలలో వీటిని తల్లి పక్షి గుర్తించి తినేస్తాయి. కాకులు ముఖ్యంగా కోకిలలు పెట్టిన గూడులో గుడ్లు పెడతాయి.
వివిధ రకాల పక్షి గుడ్లు
[మార్చు]-
An average Whooping Crane egg is 102 mm long, and weighs 208 grams
-
Eggs in a nest
-
Senegal Parrot egg (on 1 cm grid). A bird that nests in tree holes
-
Eggs of: ostrich, emu, kiwi and chicken
చేప గుడ్లు
[మార్చు]చేపల విశిష్టమైన పద్ధతి ఓవిపారిటీ. దీనిలో ఆడ చేప పరిపక్వం చెందని గుడ్లను నీటిలో ఉంచుతుంది. సామాన్యంగా ఇవి చాలా ఎక్కువ సంఖ్యలో అంటే కొన్ని మిలియన్లలో ఉంటాయి. ఇవి నీటిలో స్వేచ్ఛగా విడిచిపెట్టబడతాయి. మగ చేపలు వీటి మీద వీర్య కణాల్ని విడుస్తాయి. ఫలదీకరణం జరిగిన తర్వాత జన్మించే పిల్ల చేపలు వెంటనే ఈదు కుంటూ పోతాయి. వీనిలో చాలా వరకు పెద్ద చేపలకు ఆహారంగా చనిపోతాయి. చేపలకు తల్లి చేప గాని, తండ్రి చేప గాని సంరక్షణ బాధ్యత స్వీకరించవు.
కొన్ని చేపలు, ముఖ్యంగా రే చేపలు, సొర చేపలు ఓవీవివిపారిటీ పద్ధతి పాటిస్తాయి. దీనిలో గుడ్లు ఫలదీకరణం శరీరం లోపలే జరుగుతుంది. ఢింబకాలు గుడ్డులోని సొనను తింటాయి; తల్లి నుండి ఆహారాన్ని గ్రహించవు. తల్లి చేప పిల్ల చేపలకు జన్మనిస్తుంది. కొన్ని సార్లు అభివృద్ధి చెందిన పిల్ల చేప చిన్నవైన ఇతర చేపలను తినేస్తాయి. దీనిని అంతర గర్భశయ కానబాలిజం అంటారు.
మరికొన్ని అరుదైన వివిపారస్ సొర చేపలలో తల్లి చేప పూర్తిగా కడుపులో అభివృద్ధి చెందిన తరువాత చేప పిల్లలను కంటుంది. ఫలదీకరణం తర్వాత పిండాన్ని కడుపులో పోషిస్తుంది.
సరీసృపాల గుడ్లు సాధారణంగా మెత్తగా రబ్బరులాగా ఉండి తెల్లని రంగులో ఉంటాయి. ఇవి భూమిలో తవ్వి అక్కడ గుడ్లు పెడతాయి. పిండం యొక్క లింగం బాహ్య ఉష్ణోగ్రతపై ఆధారపడు వుంటుంది. చల్లగా ఉంటే మగ పిల్లలు తయారౌతాయి. కొన్ని సరీసృపాలు వివిపారస్ గా పిల్లల్ని కంటాయి.
అకశేరుకాల గుడ్లు
[మార్చు]కీటకాలు, మొలస్కా జీవులు, క్రస్టేషియన్లు కూడా గుడ్లు పెడతాయి.
-
A baby tortoise emerges from its egg.
-
Insect eggs, in this case those of the Emperor Gum Moth, are often laid on the underside of leaves.
-
Fish eggs, such as these herring eggs are often transparent and fertilized after laying
మూలాలు
[మార్చు]- Marine Biology notes from School of Life Sciences, Napier University.
- Speckles Make Bird Eggs Stronger, Study Finds John Pickrell, National Geographic News, 11 Oct 2005.
- Andrew Gosler, Yet even more ways to dress eggs in British Birds, vol 99 no 7, July 2006