బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, ఏలుట, ప్రేరేపించుట.

  • this influenceed me to consent యిదినన్ను సమ్మతించేటట్టు చేసినది.
  • the changes of the moon influence the season చంద్రవ్యత్యయములు కాలవ్యత్యయములను చేస్తున్నవి.
  • his will influences them in all things అన్నిట్లోనున్ను వాండ్లను మనసు యేలుతున్నది,అనగా అన్నింటికిన్ని వాండ్లు వాడి మనసు ప్రకారము నడచుకుంటారు.
  • the spur and bridle influence the horse ముల్లును, కళ్ళెమును గుర్రమును యేలుతవి,అనగా స్వాధీనపరుస్తున్నవి.

(power of stars) దశ, this was the influence of his evil starsఇది వాడి యొక్క గ్రహచారఫలము, బలము.

  • all this I could say had noinfluence with him వాడితో నేను చెప్పినదంతా నిష్పలమైపోయినది, వాడికి నేనెంతచెప్పినా గుణములేదు.
  • Reading this book produced a beneficial influenceupon him ఈ పుస్తకము చదివినందున వాడికి గుణము వచ్చినది, యీ పుస్తకముచదవడానికి నిండా ఫలకరమైది.
  • the influence of wine is to intoxicate మయకమును కలుగచేయడము సారాయి యొక్క శక్తి.
  • I saw that he was under the influence of wine వాడు సారాయి బలము మీద వుండినాడు, తాగివొళ్ళు తెలియక వుండినాడు.
  • the influence of this was very hurtful దీనికిఫలము చాలాహింసకరమైనది.
  • all this is the influence of eduaction ఇదంతా శిక్ష యొక్క బలము.
  • ascendant power; ఔన్యత్యదశ.
  • power of directing or modifing శక్తి, బలము, ప్రభావము, ప్రవేశము, చొరవ,ప్రాజాపత్యము, ప్రేరేపకత్వము, ప్రోద్బలము, వ్యాపకత్వము, ప్రసరణము, వశ్యత, స్వాధీనము.
  • the Queens gained the cause for them రాణియొక్క బలముచేత వాండ్ల పక్షము తీర్పు అయినది.
  • the medicine had noinfluence on the disease ఈ మందు రోగముమీద పారలేదు, అనగా ఆ రోగముపట్టలేదు.
  • Religion has a great influence on the felicity of men మనుష్యులయొక్క సుఖ దుఃఖములకు భక్తి ముఖ్య కారణము.
  • this grief had a great influence on her health ఈ దుఃఖము దాని శరీర సుఖముమీద అధిక వ్యాపకత్వమును కలిగియుండెను.
  • అనగా యీ దుఃఖము చేత దాని వొంటికివచ్చినది.
  • But the good news she now heard had also its influence on her health అయితే అది యిప్పుడు విన్న మంచిసమాచారమున్ను దాని శరీరసుఖముమీద వ్యాపకత్వము కలిగి యున్నది, అనగా అది విన్న మంచిసమాచారముచేత దాని వొళ్ళు కుదిరినది.
  • I had no influence with him వాడు నాకు వశ్యడు కాడు, వాడిదగ్గర నామాట యెక్కదు, వాడి దగ్గర నాకుప్రవేశములేదు, చొరవలేదు.
  • at present he has much influence in the courtఇప్పట్లో ఆ సంస్ధానములో వాడి ఫణము బాగా జరుగుచున్నది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).