విద్య అనగా జ్ఞానం సముపార్జించడం. పూర్వకాలంలో విద్యార్థులు గురువుల వద్ద ఉండి వారికి సేవ చేస్తూ విద్యను పొందేవారు. కాలక్రమేణా విద్య యొక్క స్వరూపం మరియు అర్థం మారిపోయింది. ఇది చదువుకు పర్యాయపదంగా మారింది.

విద్యపై ఉన్న కొటేషన్లు

మార్చు
  • వ్యక్తికి స్వావలంబన చేకూర్చేదే నిజమైన విద్య. --స్వామి వివేకానంద
  • విద్య మనిషి జీవితానికి వెలుగునిస్తుంది. మనిషి వికాసానికి, నడవడికి తోడ్పడుతుంది.---స్వామి వివేకానంద
  • ప్రకృతిని పరిశీలించడం ద్వారా నిజమైన విద్య లభిస్తుంది. --స్వామి వివేకానంద
  • విద్యార్థుల ఆలోచనలు, ఆచరణలు క్రమశిక్షణా సహితంగా లేకపోతే వారి చదువంతా వృథా. --మహాత్మా గాంధీ
  • మీరు పుస్తకాలు పఠించవచ్చు.కానీ అవి మిమ్మల్ని ఎక్కువ దూరం తీసుకెళ్ళలేవు.మీలోని ఉత్తమత్వాన్ని బయటికి తేవటమే నిజమైన విద్య అనిపించుకుంటుంది. --మహాత్మా గాంధీ
  • విద్య అనేది మనిషిలోని మంచిని వెలికితీయడానికి చేసే ప్రయత్నం. --ప్లేటో
  • హింసకు విరుగుడు విద్యే -- ప్రణబ్ ముఖర్జీ (రాష్ట్రపతి)[1]
  • జివితంలో ఒంటరిగా నడవడం నేర్పేదే విద్య .....హార్న్
  • విద్యలేని వాడు వింతపశువు. ........సుమతీ శతకము
  • విద్య నిఘూడమగు విత్తము. ,,,,,,,,,బర్తృహరి
  • విద్య ద్వారానే మానసిక వికాసం-సామాజిక ప్రకాశం. --పొట్లూరి హరికృష్ణ
  • చదువది ఎంత గల్గిన రసయిజ్ఞత ఇంచుక చాలకున్న ఆచదువది నిరర్థకమ్ము గుణ సంహితులెవ్వరు మెచ్చరెచ్చటన్... భాస్కర శతకము
  • చదువు లేని వాడినని దిగులు చెందకు.... ఏ చదువు చదివి పక్షులు పైకెగర గల్గెను.......ఖైది కన్నయ్య సినిమాలో ఒక పాట

విద్యపై ఉన్న సామెతలు

మార్చు
  • అభ్యాసము కూసు విద్య
  • చదువు రాక ముందు కాకరకాయ... చదువు వచ్చాక కీకరకాయ
  • చదువుకున్నోడికన్నా చాకలోడు మేలు
  • చదవేస్తే ఉన్నమతి పోయిందట ఒక సామెత
  • చదువు రాకముందు కాకరకాయ అనేవాడు చదివిన తరవాత కరకరకాయ అన్నాడట ఒక నానుడి
  • విద్య లేనివాడు వింత పశువు

మూలాలు

మార్చు
  1. ఈనాడు దినపత్రిక తేది 08-11-2012
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.