బియ్యము

ఆహార ధాన్యం

బియ్యం, భారతదేశం ప్రధాన ఆహారపంట. వరిమొక్క కంకుల నుండి వేరుచేస్తారు.

బస్తాలో బియ్యం

ఇందులో 75% కార్బోహైడ్రేటులు ఉంటాయి.

సాధారణంగా దీనిని నీటిలో వండి అన్నం తయారుచేసి, కూరలతో కలిపి తింటారు.

గంజి వంపక పోవడము మంచిది, కనుక బియ్యాన్ని తగినన్ని నీటిలో వండవలెను

ఇంకా ఇతర పదార్థములు కూడా తయారు చేసుకొని తినవచ్చు

  1. అటుకులు
  2. బొరుగులు (లేదా బొంబుపేలాలు)
  3. ఇడ్లీ, దోసె
  4. ఉప్మా
  5. పులిహోర

పాలిష్ బియ్యంతో మధుమేహం

మార్చు

తెల్లటి పాలిష్ వరి అన్నాన్ని తింటే టైప్‌-2 మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గోధుమ రంగులో ఉండే ముతకబియ్యపు అన్నం తినడం వల్ల ఈ ముప్పు తగ్గుతుంది. పాలిష్డ్‌ బియ్యం బదులు ముడి బియ్యం వినియోగిస్తే టైప్‌-2 మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. పీచుపదార్థం, ఖనిజాలు, విటమిన్లు, ఫైటోకెమికల్స్‌ వంటి అవసరమైన పోషకాలు గోధుమరంగు బియ్యంలో ఎక్కువగా ఉంటాయి. భోజనం చేశాక.. రక్తంలో చక్కెర పరిమాణాన్ని కూడా ఎక్కువగా పెంచదు. బియ్యాన్ని పాలిష్‌ చేయడం వల్ల విటమిన్లు, ఖనిజాలు, పోతాయి.

తెల్లగానే కాదు... నల్లగానూ ఉంటాయని మీకు తెలుసా..? చైనాలో ఎప్పట్నుంచో వినియోగిస్తున్న ఈ నల్ల బియ్యాన్ని శాస్త్రవేత్తలు ఇప్పుడు "సూపర్ ఫుడ్"గా అభివర్ణిస్తున్నారు. వీటిలో చక్కెర తక్కువగా ఉండటమే కాదు ఆరోగ్యాన్ని కాపాడే పీచు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా దండిగా ఉంటాయని లూసియానా రాష్ట్ర విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్లతో పోరాడటంలో దోహదం చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. "చెంచాడు నల్లబియ్యం తవుడులో బ్లాక్‍బెర్రీల్లో కన్నా అధికంగా యాంతోసైయానిన్ ఆక్సిడెంట్లు ఉంటాయి. చక్కెర మోతాదు తక్కువగానూ పీచు, "విటమిన్ ఈ" ఎక్కువగానూ ఉన్నాయని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ జిమిన్ జు పేర్కొన్నారు. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు తీసుకోవటాన్ని ప్రోత్సాహించటానికి నల్లబియ్యం తవుడు ప్రత్యేకమైన, చవకైన మార్గమని ఆయన సూచించారు.

బ్లూబెర్రీలు, ఎండు మిరప వంటి పండ్లు, కూరగాయలకు ఈ యాంతోసైయానిన్లు ముదురురంగును తెచ్చిపెడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు అయిన ఇవి రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. డీఎన్‍ఏ దెబ్బతినకుండా కాపాడుతూ క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయని పరిశోధకులు వివరించారు. పూర్వకాలంలో ఈ నల్లబియ్యాన్ని "నిషిద్ద బియ్యం" అని పిలుచుకునేవారు. పురాతన చైనాలో కేవలం గొప్పవారికే వీటిని తినటానికి అనుమతి ఉండేదట! వీటిల్లో చక్కెర తక్కువ.పీచు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగాఉంటాయి.ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్లను రానివ్వవట.నల్లబియ్యం తవుడులో బ్లాక్‌బెర్రీల్లో కన్నా అధికంగా యాంతోసైయానిన్‌ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. పండ్లు, కూరగాయలకు యాంతోసైయానిన్లు ముదురురంగును తెచ్చిపెడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. డీఎన్‌ఏ దెబ్బతినకుండా కాపాడుతూ క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయి.

రాష్ట్రంలో మిగులు ఉత్పత్తి

మార్చు

రాష్ట్రంలో ఏటా కోటి టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతోంది. రాష్ట్ర అవసరాలకు 75 లక్షల టన్నులు సరిపోతాయి. 25 లక్షల టన్నులు మిగులుండాలి. అవసరానికి మించి ఉత్పత్తి అవుతోంది గనక ధరలు పెరగాల్సిన పరిస్థితేలేదు. అయితే, భారీఎత్తున బియ్యం ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండటంతో రాష్ట్రంలో ధరలు పెరుగుతున్నాయి. మిల్లర్లు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) కి 75 కిలోల బియ్యం లెవీ కింద ఇస్తే 25 కిలోలు బహిరంగ మార్కెట్లో (రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా) అమ్ముకోవచ్చు. ఇతర రాష్ట్రాలకు తరలించినందుకు వీటిపై ఒకశాతం పన్నును మిలర్ల నుంచి వసూలు చేయాలి. అయితే 2005 నుండి పన్ను రాయితీ ఇచ్చారు.

ఇవి కుడా చూడండి

మార్చు

సోనా మసూరి

మూలాలు

మార్చు