అతిషి మార్లెనా సింగ్
అతిషి మార్లెనా సింగ్ (జననం 1981 జూన్ 8), ఒక భారతీయ రాజకీయవేత్త, విద్యావేత్త, రాజకీయ కార్యకర్త.[3] ఆమె ఢిల్లీలోని కల్కాజీ శాసనసభ నియోజకవర్గం నుండి శాసన సభ్యురాలు.[4] ఆమె ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు కూడా. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వంలో విద్య, పి.డబ్ల్యూ.డి, సంస్కృతి, పర్యాటక శాఖ మంత్రిగా పని చేస్తున్నది. ఆమె జూలై 2015 నుండి 2018 ఏప్రిల్ 17 వరకు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ప్రాథమికంగా విద్యపై సలహాదారుగా పనిచేసింది. ఆమె ప్రస్తుతం ఢిల్లీకి 8వ ముఖ్యమంత్రిగా 2024 సెప్టెంబరు 17 నుండి పనిచేస్తుంది.[5][6]
అతిషి మార్లేనా [1] | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 సెప్టెంబరు 21 - ప్రస్తుతం | |||
Lieutenant Governor | వినయ్ కుమార్ సక్సేనా | ||
---|---|---|---|
చదువు, స్త్రీ & శిశు సంక్షేమం, సంస్కృతి & పర్యాటక, ప్రజా పనుల శాఖ మంత్రి, ఢిల్లీ ప్రభుత్వం
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2023 మార్చి 9 | |||
ముందు | మనీష్ సిసోడియా | ||
ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2020 ఫిబ్రవరి 12 | |||
ముందు | అవతార్ సింగ్ | ||
నియోజకవర్గం | కల్కాజీ శాసనసభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఢిల్లీ, భారతదేశం | 1981 జూన్ 8||
రాజకీయ పార్టీ | ఆమ్ ఆద్మీ పార్టీ | ||
జీవిత భాగస్వామి | ప్రవీణ్ సింగ్[2] |
ప్రారంభ జీవితం
మార్చుఅతిషి 1981 జూన్ 8న ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్‌లు విజయ్ సింగ్, త్రిప్తా వాహీలకు జన్మించింది.[7][8] ఆమె తల్లిదండ్రులు ఆమెకు 'మార్లేనా' అనే పేరు పెట్టారు. 2018లో, జాతీయ ఎన్నికలకు ముందు, ఆమె "అతిషి"ని తన పేరు మార్చుకుంది.[9][10]
ఢిల్లీలో పుట్టి పెరిగిన ఆమె, న్యూ ఢిల్లీలోని స్ప్రింగ్‌డేల్స్ స్కూల్ నుండి హైస్కూల్ చదువు పూర్తి చేసింది.[11] 2001లో, ఆమె సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ నుండి చరిత్రలో పట్టభద్రురాలయ్యింది. ఆ తరువాత, ఆమె ఇంగ్లాండు వెళ్ళి ఆక్స్‌ఫర్డ్ నగరంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుండి చెవెనింగ్ స్కాలర్‌షిప్‌పై చరిత్రలో మాస్టర్స్ డిగ్రీ 2003లో పూర్తి చేసింది.[12] 2005లో, ఆమె ఆక్స్‌ఫర్డ్‌లోని మాగ్డలెన్ కాలేజీకి రోడ్స్ స్కాలర్‌గా వెళ్ళింది.[13]
రాజకీయ జీవితం
మార్చు2013 జనవరిలో, ఆమె ఆమ్ ఆద్మీ పార్టీ విధాన రూపకల్పనలో పాల్గొంది.[14]
ఆమె 2015 మధ్య ప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో జల్ సత్యాగ్రహంతో సన్నిహితంగా పాల్గొంది. చారిత్రాత్మక నిరసనల సమయంలో, అలాగే న్యాయపోరాటం సమయంలో అలోక్ అగర్వాల్ ప్రచారానికి నాయకత్వం వహించిన ఆప్ నాయకులు, కార్యకర్తకు మద్దతునిచ్చింది.[15] 2020 ఎన్నికల తర్వాత, ఆమె గోవా ఆప్ కి ఇన్‌ఛార్జ్‌గా నియమించబడ్డారు.[16]
2019 లోక్‌సభ ఎన్నికలకు తూర్పు ఢిల్లీకి లోక్‌సభ ఇన్‌ఛార్జ్‌గా ఆమె నియమితులయ్యింది.[17] ఆమె 2019 లోక్‌సభ ఎన్నికలకు ఆప్ పార్టీ అభ్యర్థిగా తూర్పు ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసింది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గౌతమ్ గంభీర్‌పై ఆమె 4.77 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయి మూడో స్థానంలో నిలిచింది.
ఆమె 2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ లోని కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేసింది. ఆమె భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ధరంబీర్ సింగ్‌పై 11,422 ఓట్ల తేడాతో విజయం సాధించింది.[18]
ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ రాజీనామా తర్వాత సౌరభ్ భరద్వాజ్‌తో పాటు ఆమె ఢిల్లీ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా చేరింది.
2020 నుండి, ఆమె కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 7వ ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికైన సభ్యురాలిగా ఉంది.
ఆమె 2024 సెప్టెంబర్ 21న ఢిల్లీ ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టింది.[19]
మూలాలు
మార్చు- ↑ "AAP's Atishi has a surname again – and it's not 'Marlena'". Ndtv.com. Archived from the original on 26 February 2023. Retrieved 26 February 2023.
- ↑ "Election of India - Affidavit" (PDF). Archived (PDF) from the original on 23 April 2019. Retrieved 6 October 2023.
- ↑ "Candidate Affidavit" (PDF). 20 January 2020. Archived from the original (PDF) on 17 August 2021. Retrieved 25 August 2022.
- ↑ "The Aam Aadmi of AAP: 5 personal stories of sacrifice, triumph and validation". The Economic Times. Archived from the original on 24 April 2022. Retrieved 2016-09-04.
- ↑ "AAP's Atishi To Be Delhi's New Chief Minister, Chosen By Arvind Kejriwal". NDTV.com. Retrieved 2024-09-17.
- ↑ https://www.indiatoday.in/india/story/atishi-delhi-chief-minister-aap-arvind-kejriwal-2601112-2024-09-17
- ↑ "AAP leader Atishi drops her second name Marlena, denies caste angle". Hindustan Times (in ఇంగ్లీష్). 2018-08-29. Archived from the original on 11 September 2018. Retrieved 2020-08-16.
- ↑ "BJP, Congress, beware! Atishi Marlena is a Rajputani, warns Manish Sisodia". Business Standard. Press Trust of India. 2019-04-28. Archived from the original on 25 November 2020. Retrieved 2020-08-16.
- ↑ "Atishi drops her name Marlena". Hindustan Times. 28 August 2018. Archived from the original on 11 September 2018. Retrieved 10 September 2018.
- ↑ Banerjee, Akash. "Six lessons in 'affordable politics': AAP victory shows how elections can be fought on a shoestring". Scroll.In. Archived from the original on 12 February 2015. Retrieved 10 February 2015.
- ↑ "Meet the young leaders hoping to infuse vitality into our democracy". Hindustan Times. 20 June 2015. Archived from the original on 2 October 2016. Retrieved 29 September 2016.
- ↑ "AAP's Atishi Marlena drops second name after being announced as party's 1st candidate for 2019 Lok Sabha polls". Times Now. 2018-08-28. Archived from the original on 12 February 2019. Retrieved 2019-02-11.
- ↑ "Rhodes Scholars: complete list, 1903-2015". The Rhodes Trust. Archived from the original on 2013-11-06. Retrieved 2016-09-04.
- ↑ "The Aam Aadmi of AAP: 5 personal stories of sacrifice, triumph and validation". The Economic Times. Archived from the original on 24 April 2022. Retrieved 2016-09-04.
- ↑ "Meet the young leaders hoping to infuse vitality into our democracy". 2015-06-20. Archived from the original on 2 October 2016. Retrieved 2016-09-29.
- ↑ "AAP's Raghav Chadha Set To Be Appointed Vice Chairman of Delhi Jal Board, Atishi Gets New Role Too". NDTV.com. Archived from the original on 29 February 2020. Retrieved 2020-02-29.
- ↑ "Amidst speculation of alliance with Congress, AAP appoints Lok Sabha in-charges for five Delhi seats". dna. 2018-06-02. Archived from the original on 12 June 2018. Retrieved 2018-06-10.
- ↑ "AAP candidates Manish Sisodia and Atishi won from Patparganj and Kalkaji Assembly constituencies after trailing in early trends". 11 February 2020. Archived from the original on 11 February 2020. Retrieved 11 February 2020.
- ↑ Eenadu (22 September 2024). "దిల్లీ సీఎం పీఠంపై ఆతిశీ". Archived from the original on 22 September 2024. Retrieved 22 September 2024.