భారతీయ సంస్కృతి

వికీపీడియా నుండి
(సంప్రదాయం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

భారతదేశ సంస్కృతి భారతదేశంలో వేర్వేరుగా ఉన్న అన్ని మతాలు, వర్ణాలు, కులాల , వర్గాల సమష్టి కలయిక. భారతదేశంలోని భిన్న సంస్కృతుల ఏకత్వం. భారతదేశము లోని వివిధ భాషలు, మతాలు, సంగీతం, నృత్యం, ఆహారం, నిర్మాణ కళ , ఆచారాలు, వ్యవహారాలు దేశంలో ఒక్కో ప్రాంతానికి ఎంతో భిన్నంగా ఉంటాయి. భారతీయ సంస్కృతి అనేది అనేక సంస్కృతుల సమ్మేళనంగా పిలువబడుతున్నది , ఇది భారత ఉపఖండం మొత్తంలో విస్తరించి ఉంది , అనేక వేల సంవత్సరాల చరిత్రను ప్రభావితం చేసింది. భారతీయ సంస్కృతిలో వైవిధ్యమైన భాగంగా ఉన్న భారతీయ మతాలు, భారతీయ తత్వశాస్త్రం , భారతీయ వంటకాలు వంటి అనేక అంశాలు ప్రపంచవ్యాప్తంగా బలీయమైన ప్రభావం కలిగి ఉన్నాయి.[1][2]

సంస్కృతి

[మార్చు]
 భారతీయ మతాలు సమ్మేళనం భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి.
హిందువుల కందరియ మహాదేవ ఆలయం
జైనుల పాలిటానా టెంపుల్స్
బౌద్ధుల మహాబోధి ఆలయం
హర్ మందిర్ సాహెబ్, స్వర్ణ మందిరము పేరుతో ప్రసిద్ధి. సిక్కుల పవిత్ర క్షేత్రం.

భారతదేశం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు వాటి వివిధ సంస్కృతులు, నాగరికతలతో వైవిధ్యమైన సంస్కృతి కలిగినది, ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశాలలో ఒకటి.[3] భారతీయ సంస్కృతిని తరచూ పలు విభిన్న సంస్కృతుల సమ్మేళనంగా పిలుస్తారు, ఇది భారత ఉపఖండంలో మొత్తం వ్యాపించింది. దాదాపుగా 5000 సంవత్సరాలకు పూర్వం నుండే భారత సంస్కృతి[permanent dead link] ఉన్నట్టు చరిత్ర కారులు చెబుతారు ఇది అనేక వేల సంవత్సరాల పురాతనమైన చరిత్రచే ప్రభావితం చేయబడింది , మలచబడి ఉంది. భారతదేశ చరిత్ర మొత్తంలో, భారతీయ సంస్కృతి ధార్మిక మతాలచే బాగా ప్రభావితం చేయబడి ఉంటుంది.[4] భారతీయులు, భారతీయ తత్వశాస్త్రం, సాహిత్యం, వాస్తుశిల్పం, కళ , సంగీతం రూపొందించడంలో చాలా ఘనత పొందారు. [5] గ్రేటర్ ఇండియా భారతీయ సంస్కృతి చారిత్రక పరిధి అనేది భారతీయ ఉపఖండం నకు మించింది. ఇది ముఖ్యంగా హిందూ మతము, బౌద్ధమతం, వాస్తు, శిల్పం, భవన నిర్మాణ శాస్త్రం పరిపాలన , వ్రాత వ్యవస్థలు కామన్ ఎరా ప్రారంభ శతాబ్దాల్లో ప్రయాణీకులు , సముద్ర వ్యాపారులు సిల్క్ రోడ్ ద్వారా ఆసియాలోని ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందింది. [6] గ్రేటర్ ఇండియా పశ్చిమాన, హిందూ కుష్ , పామిర్ పర్వతాలలో గ్రేటర్ పర్షియాతోను కలసి విస్తరించి ఉంది. [7] అనేక శతాబ్దాలుగా, బౌద్ధులు, హిందువులు, ముస్లింలు, జైనులు, సిక్కులు , భారతదేశంలోని వివిధ గిరిజన ప్రజల మధ్య వివిధ సంస్కృతుల గణనీయమైన కలయికను కలిగి ఉంది. [8] [9][10]

భారతదేశం హిందూ మతం, బౌద్ధమతం, జైన మతం, సిక్కు మతం , ఇతర మతాలు జన్మస్థలం. వీటిని సమష్టిగా భారతీయ మతాలు అని పిలుస్తారు. [11] నేడు, హిందూమతం , బౌద్ధమతం వరుసగా మూడో , నాల్గవ అతిపెద్ద మతాలుగా ఉన్నాయి, వీటిలో 2 బిలియన్ల మంది మతాన్ని ఆరాధించి ఆచరించే అనుచరులు ఉన్నారు.[12][13],[14] దాదాపుగా 2.5 లేదా 2.6 బిలియన్ల మంది ఆదరించి అనుసరించే అనుచరులు ఉన్నారు..[12][15] భారతీయ మతాలను ఆరాధించి ఆచరించే అనుచరులు అయినటువంటి హిందువులు, సిక్కులు, జైనులు , బౌద్ధులు భారతదేశంలో 80-82% జనాభా ఉన్నారు.   ప్రపంచంలోని అత్యంత ఆరాధనతో కూడిన మత సంఘాలు , సంస్కృతులతో కలిగి ఉండి మతపరంగా , జాతిపరంగా విభిన్న దేశాలలో భారతదేశం కూడా ఒకటి. ఈ మతాలు అనేకమంది ప్రజల జీవితంలో కేంద్ర స్థానంలో ఉండి , నిర్ణయాత్మక, నిశ్చయాత్మక పాత్రను వారి మీద పోషిస్తున్నాయి. భారతదేశం ఒక లౌకిక హిందూ-మెజారిటీ దేశం అయినప్పటికీ, ఈ దేశంలో అతి పెద్ద ముస్లిం జనాభాను ఇది కలిగి ఉంది. భారతదేశం లోని జమ్మూ కాశ్మీర్, లఢక్ , పంజాబ్, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, మిజోరం , లక్షద్వీప్ లను మినహాయించితే హిందువులు 24రాష్ట్రాలు , 6 కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యధిక జనాభాను కలిగి ఉన్నారు. అదేవిధముగా, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కేరళ, తెలంగాణ, పశ్చిమబెంగాల్ , అస్సాం రాష్ట్రాలలో ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా జమ్ము కాశ్మీర్ , లక్షద్వీప్ లలో మాత్రం ఎక్కువమంది ముస్లిం జనాభా ఉన్నారు. అలాగే సిక్కులు , క్రైస్తవులు భారతదేశంలోని ఇతర ముఖ్యమైన మైనారిటీ ప్రజలు ఉన్నారు.

2011 సం.జనాభా లెక్కల ప్రకారం, భారతదేశంలో 79.8% మంది హిందూ మతాన్ని ఆచరించి, పాటిస్తున్నారు. భారతదేశంలో హిందూ మతము అనుసరించి ఆచరించే ప్రజలు తరువాత ఇస్లాం (14.2%), క్రైస్తవ మతం (2.3%), సిక్కు మతం (1.7%), బౌద్ధ మతం (0.7%) , జైనమతం (0.4%) అనే ఇతర ప్రధాన మతాలు ఆచరించే వారు ఉన్నరు. [16] హిందూ మతం, బౌద్ధమతం, ఇస్లాం మతం , క్రైస్తవ మతం వంటి ప్రధాన మతాలచే భారతదేశంలో వివిధ ప్రాంతాలలో ప్రభావితమైనప్పటికీ, సార్నాయిజం వంటి అనేక గిరిజన మతాలు కూడా భారతదేశంలో కనిపిస్తాయి. [17] జైనమతం, జొరాస్ట్రియనిజం, జుడాయిజం, , బహాయి విశ్వాసం కూడా ప్రభావవంతమైనవి, కానీ వాటి సంఖ్య చాలా తక్కువగా ఉంది. [17]భారతదేశంలో కూడా నాస్తికత్వం , అజ్ఞేయవాదం లక్షణాలు అక్కడాక్కడా కనిపించే ప్రభావాన్ని కలిగి ఉంటాయి. [17] ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, 2050 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద హిందువులు , ముస్లింలను కలిగి ఉన్న దేశంగా ఉంటుంది. భారతదేశంలో సుమారు 311 మిలియన్ల ముస్లింలు జనాభాలో 19-20% మంది ఉన్నారు. ఇంకా సుమారు 1.3 బిలియన్ల హిందువులు జనాభాలో 76% మంది భారతదేశంలో నివసిస్తున్నారు.

కుటుంబ నిర్మాణం , వివాహం

[మార్చు]
భారత దేశములో వివాహం
భారతదేశంలోని పంజాబ్ లోని సాంప్రదాయ హిందూ వివాహ వేడుకలో వధువు.
సాంప్రదాయ హిందూ వివాహ వేడుకలో చీరలో వధువు , షేర్వాణీలో వరుడు.

భారతదేశంలో కొన్ని తరాల వరకు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనే ప్రబలమైన సంప్రదాయం కలిగి ఉంది. తల్లిదండ్రులు, పిల్లలు, పిల్లల జీవిత భాగస్వాములు , వారి సంతానం మొదలైనవారు - కుటుంబ సభ్యులందరూ విస్తరించినప్పుడు - అందరూ కలిసి జీవిస్తుంటారు. సాధారణంగా, ఈ ఉమ్మడి భారత కుటుంబ వ్యవస్థలో అతి పెద్ద వయసుగల మగమనిషి ఆ కుటుంబానికి పెద్దగా ఉంటాడు. కుటుంబ పెద్ద తను అన్ని ముఖ్యమైన నిర్ణయాలు , నియమాలను ఎక్కువగా చేస్తాడు , ఇతర కుటుంబ సభ్యులు వాటిని ఆచరించి, ఆదరించి, అనుసరించి కట్టుబడి ఉంటారు. [18]

నిశ్చయ వివాహం

[మార్చు]
భారతీయ వధువులు

పెద్దలు నిర్ణయించి కుదిర్చిన పెళ్ళిని నిశ్చయ వివాహం అంటారు. నిశ్చయ వివాహాన్ని ఆంగ్లంలో ఆరేంజ్డ్ మ్యారేజ్ అని అంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం భారతదేశంలోని హిందువులు నిశ్చయ వివాహాలను జరిపిస్తున్నారు. భారతీయ సమాజంలో నిశ్చయ వివాహాలు దీర్ఘకాలంగా మనగలిగి ఒక పద్ధతిలో కట్టుబడి ఉన్నాయి. నేటికి కూడా, ఎక్కువమంది భారతీయులు వారి తల్లిదండ్రులు, బంధువులు , ఇతర గౌరవనీయ కుటుంబం సభ్యుల ద్వారా మాత్రమే వివాహం చేసుకుంటారు. గతంలో, చిన్న వయస్సు నందే వివాహం జరిగేది. [19] 2009 సం.లో, సుమారు 7% స్త్రీలు 18 సంవత్సరాల వయసులోపుననే వివాహం చేసుకున్నారు. [20] 2011 సం. భారతదేశ జనాభా లెక్కల ప్రకారం, భారతదేశంలో మహిళలకు వివాహం చేసుకునే సగటు వయసు 21 సంవత్సరాలుకు పెరిగింది. [21]

మూలాలు

[మార్చు]
  1. John Keay (2011), India: A History, 2nd Ed – Revised and Updated, Grove Press / Harper Collins, ISBN 978-0-8021-4558-1, see Introduction and Chapters 3 through 11
  2. Mohammada, Malika (2007), The foundations of the composite culture in India, Aakar Books, ISBN 81-89833-18-9
  3. Kenoyer, Jonathan Mark; Heuston, Kimberley (May 2005). The Ancient South Asian World. Oxford University Press. ISBN 0-19-517422-4. OCLC 56413341. Archived from the original on 2012-11-20. Retrieved 2017-08-30.
  4. Nikki Stafford Finding Lost, ECW Press, 2006 ISBN 1-55022-743-2 p. 174
  5. "1". Cultural History of India. New Age International Limited Publications. 2005. p. 3. ISBN 81-224-1587-3.
  6. Southeast Asia: A Historical Encyclopedia, from Angkor Wat to East Timor, by Keat Gin Ooi p.642
  7. Hindu-Buddhist Architecture in Southeast Asia by Daigorō Chihara p.226
  8. Lange, Christian. Justice, Punishment and the Medieval Muslim Imagination. Cambridge Studies in Islamic Civilization. Cambridge University Press. ISBN 978-0-521-88782-3. Archived from the original on 2021-08-16. Retrieved 2017-08-30.
  9. E. Dunn, Ross. The adventures of Ibn Battuta, a Muslim traveller of the fourteenth century. University of California Press, 1986. ISBN 978-0-520-05771-5. ISBN 0-520-05771-6.
  10. Tharoor, Shashi (1997). India: From Midnight to the Millennium and Beyond. Arcade Publishing, 2006. ISBN 978-1-55970-803-6. ISBN 1-55970-803-4.
  11. Nikki Stafford (2006). Finding Lost: The Unofficial Guide. ECW Press. p. 174. ISBN 978-1-55490-276-7. Retrieved 5 December 2013.
  12. 12.0 12.1 "45". What Is Hinduism?Modern Adventures Into a Profound Global Faith. Himalayan Academy Publications. 2007. p. 359. ISBN 1-934145-00-9.
  13. "Non Resident Nepali – Speeches". Nrn.org.np. Archived from the original on 25 డిసెంబరు 2010. Retrieved 30 మార్చి 2018.
  14. "BBCVietnamese.com". Bbc.co.uk. Retrieved 1 August 2010.
  15. "Religions of the world: numbers of adherents; growth rates". Religioustolerance.org. Archived from the original on 25 జనవరి 2021. Retrieved 1 August 2010.
  16. "India has 79.8% Hindus, 14.2% Muslims, says 2011 census data on religion". First Post. August 26, 2015. Retrieved 2015-09-22.
  17. 17.0 17.1 17.2 Clothey, Fred (2006). Religion in India : a historical introduction. London New York: Routledge. ISBN 978-0-415-94024-5.
  18. "Indian Families". Facts About India. Archived from the original on 30 జూలై 2011. Retrieved 31 మార్చి 2018.
  19. Heitzman, James. "India: A Country Study". US Library of Congress. Retrieved 26 December 2012.
  20. K. Sinha Nearly 50% fall in brides married below 18 The Times of India (February 10, 2012)
  21. Women and men in India 2012 Archived 12 అక్టోబరు 2013 at the Wayback Machine CSO/Census of India 2011, Government of India, pp xxi

గ్రంథ పట్టిక

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]