ప్రచ్ఛన్నయుద్ధం

వికీపీడియా నుండి
(శీతల సమరము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
1989 లో బెర్లిన్ గోడ పతనం

రెండవ ప్రపంచ యుద్ధం పిమ్మట అగ్ర రాజ్యాలుగా రూపు దిద్దుకున్న అమెరికా, సోవియట్ యూనియన్ ల మధ్య చిరకాలంపాటు కొనసాగిన ఉద్రిక్త పూర్వక ద్వైపాక్షిక సంబంధాలకే ప్రచ్ఛన్నయుద్ధం లేదా శీతల సమరము (Cold War) అని పేరు. పరస్పరాధిక్య ప్రదర్శన, ఆయుధ, క్షిపణి సమీకరణ, అనేక ప్రపంచ దేశాల ఏకపక్ష మొగ్గుతో కూడుకొన్న ఈ కాలాన్ని ఆయుధసాధిత శాంతియుగం అని కూడా వ్యవహరిస్తుంటారు.

రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు బలాబలాలు కలుపుకొని మిత్రదేశాలుగా ఒక వైపు పోరాడిన అమెరికా, బ్రిటన్, రష్యాలు శత్రుదేశాలైన జర్మనీ, ఇటలీ, జపాన్ లను ఓడించాయి. కానీ యుద్ధం ముగుస్తూనే అమెరికా-బ్రిటన్ లకు, సోవియట్ యూనియన్ కు మధ్య తీవ్ర విభేదాలు పొడచూపాయి. అచిరకాలం లోనే ఇది అధిక పక్షం ప్రపంచ దేశాల వర్గ విభజనకు దారితీసేంతగా ఎదిగింది. రష్యా నాయకత్వంలో సామ్యవాద దేశాలన్నీ ఒక వర్గమైతే, అమెరికా వైపు పెట్టుబడిదారీ వ్యవస్థలన్నీ వత్తాసు పలికాయి1[permanent dead link]

రష్యా, అమెరికా నేరుగా యుద్ధాలేవీ పోరాడక పోయినా, వ్యూహాత్మక ప్రణాళికలు, క్షిపణి మొహరింపులతో పొంచియున్న మరో భయంకర ప్రపంచయుద్ధాన్ని తలపింపజేస్తుండేవి. బెర్లిన్ ఘర్షణ, కొరియా యుద్ధం, సోవియట్ యూనియన్ అణుపాటవ పరీక్షలు, భారత్ చైనా యుద్ధం 1962, క్యూబా క్షిపణి సంక్షోభం మొదలయిన అనేక సమస్యలు ఈ అంతర్గత ఒత్తిడిని రగులుస్తూ బహిర్గతం చేస్తూండేవి

1991 లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమై రష్యా బలం క్షీణించడంతో శీతల సమరం ముగిసి, అమెరికా ఏకైక అగ్ర రాజ్యంగా ఎదిగింది.

మూలాలు

[మార్చు]