విక్రం రాథోర్
విక్రం రాథోర్ (Vikram Rathour) భారత క్రికెట్ మాజీ క్రీడాకారుడు.
జీవిత విశేషాలు
[మార్చు]అతను 1969 మార్చి 26 న పంజాబ్ లోని జలంధర్లో జన్మించాడు. ఇతడు 1996, 1997 కాలంలో భారత జట్టుకు 6 టెస్టులు, 7 వన్డేలలో ప్రాతినిధ్యం వహించాడు. వన్డేలలో 2 అర్ధ సెంచరీలు సాధంచాడు. అతను కుడిచేతి ఓపెనింగ్ బ్యాట్స్ మాన్. 146 మ్యాచ్‌ల్లో 49.66 సగటుతో 11473 పరుగులు సాధించిన రాథౌర్ ఫస్ట్ క్లాస్ స్థాయిలో ముఖ్యమైన పరుగుల స్కోరర్‌గా నిలిచాడు. అతని లిస్టు-A కెరీర్ మరింత నిరాడంబరంగా ఉంది. అతను 99 మ్యాచ్‌ల్లో కేవలం 3000 పరుగులు చేశాడు. ప్రస్తుతం అతను భారత క్రికెట్ జట్టుకు బ్యాటింగ్ కోచ్ గా ఉన్నాడు[1].
2012 సెప్టెంబరు 27 న విక్రమ్ రాథౌర్‌ను నార్త్ జోన్ నుంచి జాతీయ సెలెక్టర్‌గా నియమించారు.[2]
అంతర్జాతీయ కెరీర్
[మార్చు]విక్రమ్ రాథౌర్ 2003 నవంబరులో ఫస్ట్-క్లాస్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. తన టెస్ట్ కెరీర్లో, అతను 10 ఇన్నింగ్స్, ఆరు మ్యాచ్‌లలో 131 పరుగులు చేశాడు.[3] దక్షిణాఫ్రికాతో ది వాండరర్స్‌లో అతను అత్యధికంగా 44 పరుగులు చేశాడు. కోచ్ బిషన్ సింగ్ బేడి సారథ్యంలో రంజీ ట్రోఫీని గెలుచుకున్న జట్టులో రాథోర్ సభ్యుడు.
మూలాలు
- ↑ https://economictimes.indiatimes.com/magazines/panache/meet-vikram-rathour-indias-new-batting-coach-who-boasted-of-an-impressive-form-during-the-90s/articleshow/70814852.cms?from=mdr
- ↑ "Patil is Chief Selector, Amarnath exits". Wisden India. 27 September 2012. Archived from the original on 8 డిసెంబరు 2012. Retrieved 25 ఏప్రిల్ 2020.
- ↑ "Vikram Rathour retires". The Hindu. November 5, 2003. Archived from the original on 2015-04-22. Retrieved 2017-02-16.