షాడోల్ జిల్లా

వికీపీడియా నుండి
08:27, 6 ఫిబ్రవరి 2023 నాటి కూర్పు. రచయిత: ChaduvariAWBNew (చర్చ | రచనలు)
(తేడా) ←పాత కూర్పు | ప్రస్తుతపు కూర్పు చూపించు (తేడా) | దీని తరువాతి కూర్పు→ (తేడా)
Jump to navigation Jump to search
Shahdol జిల్లా
शहडोल जिला
మధ్య ప్రదేశ్ పటంలో Shahdol జిల్లా స్థానం
మధ్య ప్రదేశ్ పటంలో Shahdol జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
డివిజనుShahdol
ముఖ్య పట్టణంShahdol
Government
 • లోకసభ నియోజకవర్గాలుShahdol
విస్తీర్ణం
 • మొత్తం5,671 కి.మీ2 (2,190 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం15,64,989
 • జనసాంద్రత280/కి.మీ2 (710/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత72.36%
 • లింగ నిష్పత్తి968
Websiteఅధికారిక జాలస్థలి
విరాటేశ్వర దేవాలయం

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో షాడోల్ జిల్లా ఒకటి. షాడోల్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. షాడోల్ జిల్లా షాడోల్ డివిజన్‌లో (అదనంగా [[అనుప్పూర్ , ఉమరియా) భాగం. జిల్లావైశాల్యం 5,671 చ.కి.మీ. 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 908,148. వీరిలో షెడ్యూల్డ్ తెగల సంఖ్య 391,027. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 67,528.

విరాటేశ్వర్ ఆలయం జిల్లాలో ప్రముఖ పర్యాటక్షేత్రాలలో ఒకటిగా అలాగే నిర్మాణ వైభవం ఉన్న ఆకర్షణలలో ఒకటిగా గుర్తించబడుతుంది. జిల్లా తూర్పు పడమరల మధ్య దూరం (110) ఉత్తర దక్షిణాల మధ్య దూరం 170 కి.మీ. .

చరిత్ర

[మార్చు]

జిల్లాపేరుకు జిల్లాలోని సోహగ్‌పూర్ గ్రామంలోని షహ్‌డోల్ అహిర్‌కు సంబంధం ఉంది. సోహగ్‌పూర్ లోని ఇలకదార్ కుంటింబ మూలపురుషుడు జమ్నిభన్ (బగేల్‌ఖండ్ మహారాజా విర్భన్ సింగ్ కుమారుడు) సోహగ్పూర్‌లో స్థిరపడాలని నిశ్చయించుకున్నాడు. తరువాత సోహగ్‌పూర్‌లో తననివాసానికి అవసరమైన సౌకర్యాలను చేయడానికి తగిన ఏర్పాట్లు చేయడానికి అరణ్యాన్ని తొలగించి నివాస ప్రాంతంగా చేయమని ఆదేశించాడు. అలాగే ఆప్రదేశానికి అక్కడ నివసించిన పూర్వీకుల పేరును పెట్టాలని సూచించాడు. అక్కడ ముందుగా షహడోల్వా అహిర్ నివసించాడని విశ్వసించిన కారణంగా ఈ ప్రాంతానికి షహడోల్వా అని నామకరణం చేయబడింది. తరువాత రీవా మహారాజు దీనిని కేంప్ ప్రాంతంగా వాడుకున్నారు. బ్రిటిష్ అధికారులు పర్యటన సమయంలో దీనిని వాడుకున్నారు. అనేక మంది ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు. క్రమంగా ఇది పట్టణంగా మారింది. 1947లో రాజాస్థానం సమైక్యభారతంలో చేర్చబడిన తరువాత జిల్లాకేంద్రం ఉమరియా నుండి షహ్‌దొల్‌కు మార్చబడింది.

ఆకర్షణీయమైన పచ్చని అరణ్యాలు బొగ్గు వంటి సహజ నిక్షేపాలు, ఆది మానవ సంతతికి చెందిన ప్రజలతో జిల్లా ఆకర్షణీయంగా ఉంటుంది. షాడోల్ వింధ్యపర్వతశ్రేణిలో ఉంది. జిల్లాలో విస్తారమైన బొగ్గునిక్షేపాలు ఉన్నాయి.

సరిహద్దులు

[మార్చు]

షాడోల్ జిల్లా మధ్యప్రదేశ్ ఈశాన్య భూభాగంలో ఉంది. జిల్లా వైశాల్యం 5671 చ.కి.మీ. జిల్లా ఆగ్నేయ సరిహద్దులో అనుప్పూర్ జిల్లా, ఉత్తర సరిహద్దులో సత్నా జిల్లా, సిధి జిల్లా, పశ్చిమ సరిహద్దులో ఉమరియా జిల్లా ఉన్నాయి. 22°38' నుండి 24°20' డిగ్రీల అక్షాంశం, 30°28' నుండి 82°12' తూర్పు రేఖాంశంలో ఉంది.

నైసర్గికం

[మార్చు]

జిల్లా దక్కన్ పీఠభూమి ఈశాన్య భూభాగంలో ఉంది. జిల్లా ( త్రిజంక్షన్) సాత్పురా పర్వతశ్రేణిలోని మైకల్ పర్వతశ్రేణి, వింధ్యపర్వతాలలోని కైమూర్ పర్వతశ్రేణి, చోటానాగ్పూర్ పీఠభూమి లోని పర్వతశ్రేణి కూడలి ప్రదేశంలో ఉంది. ఈ పర్వతకూడలిలో సన్ నదీలోయ, దాని ఉపనదులు ఉన్నాయి. సన్ నదీతీరం వెంట కైమూర్ పర్వతశ్రేణి కొనసాగుతూ ఉంది. జిల్లా భౌగోళికంగా మూడు భాగాలుగా విభజించబడింది.

  • మైకల్ రేంజ్
  • తూర్పు పీఠభూమి యొక్క కొండలు
  • అప్పర్ కుమారుడు వ్యాలీ

భౌగోళికం

[మార్చు]

షాడోల్ జిల్లా కొండప్రాంతం. ఇక్కడ అరణ్యాలలో సాల వృక్షాలు, ఇతర వృక్షాలతో అందగా ఉంటుంది. జిల్లా వైశాల్యం 5671 చ.కి.మీ. .

ఖనిజాలు

[మార్చు]

షాడోల్ జిల్లాలో పుష్కలంగా ఖనిజ సంపద ఉంది. జిల్లాలో బొగ్గు, వంటచెరకు, జేగురు మట్టి, పాలరాయి ఖనిజాలు ఉన్నాయి. సోహగపూర్ కోయల్‌ఫీల్డ్ జిల్లా ఆదాయంలో ప్రధాన పాత్ర వహిస్తుంది.

బొగ్గు

[మార్చు]

సోహగపూర్ కోయల్‌ఫీల్డ్ వైశాల్యం 3100 చ.కి.మీ. పలుచని పై పొరని అప్పర్ బరకార్ అని భూమి అడుగు పొరలో ఉన్న పొరను లోయర్ బరకర్‌ అని అంటారు. లోపలి పొర నాణ్యమైనది. సాధారణంగా బొగ్గులో ర్యాంక్, హై మాయిశ్చర్, హై వొలాటీస్, నాన్- కుకింగ్ అని వర్గీకరించబడి ఉంటుంది. ఈ గనులలో 4064 మిలియన్ టన్నుల బొగ్గు నిలువలు ఉన్నాయని భావిస్తున్నారు.

బంక మట్టి

[మార్చు]

జముని, హినోటా సమీపంలో నల్లరేగడిమన్ను ఉంది.

జేగురు మట్టి

[మార్చు]

షాడోల్ జిల్లాలోని పచ్డి వద్ద జేగురుమన్ను నిక్షేపాలు లభిస్తున్నాయి.

పాలరాయి

[మార్చు]

జిల్లాలోని ఫాస్గర్హి, బగ్దారి, పాపరేడి గ్రామాలలో పాలరాతి నిక్షేపాలు లభిస్తున్నాయి. జిల్లాలో ఖనిజనిక్షేపాలు పరిశోధన స్థాయిలో ఉన్నాయి.

ఆర్ధికం

[మార్చు]

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో ... జిల్లా ఒకటి అని గుర్తించింది.[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర 24 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[1]

వ్యవసాయం

[మార్చు]

జిల్లా వ్యవసాయ పరంగా బలహీనంగా ఉంది. జిల్లాలోని గిరిజనులు సంప్రదాయ పద్ధతులలో పంటలు పండిస్తున్నారు. వ్యవసాయ భూమి వైశాల్యం చిన్నచిన్నదిగా ఉంది. ప్రధానంగా గిరిజనులు మద్యతరహా వ్యవసాయులుగా ఉన్నారు. వార్షిక వ్యవసాయ ఉత్పత్తి వారి ఆహార అవసరాలకు తగినంతగా లేదు. వారు దినకూలికి పనిచేస్తుంటారు. మహుయా పండు, టేకు విత్తనాలు సేకరణ ప్రజల ఆదాయ వనరులలో ఒకటిగా ఉంది.

గిరిజన జీవనస్థాయి

[మార్చు]

గిరిజన ప్రజల జీవనస్థాయి చాలా నిరాడంబరంగా ఉంటుంది. వీరు తమ గృహాలను మట్టి, వెదురు పుల్లాలు, వరిగడ్డి, ప్రాంతీయ పెంకులతో నిర్మించుకుంటారు. గిరిజన ప్రజలలో పురుషులు ధోతి, ఫతోహి, తలపాగా ధరిస్తారు. స్త్రీలు కాంష్ (చీర) ధరిస్తారు. చీరలు శరీర వర్ణంకలిగి ఉంటాయి. గిరిజన స్త్రీలు వారి చేతులు, కాళ్ళు, మెడ వంటి శరీర భాగాలను వర్ణాలను పూసుకుంటారు. గిరిజనులు వెదురు, గింజలు, లోహంతో చేసిన ఆభరణాలు ధరిస్తుంటారు. .

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,064,989,[2]
ఇది దాదాపు. సైప్రస్ దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. రోడో ఐలాండ్ నగర జనసంఖ్యకు సమం..[4]
640 భారతదేశ జిల్లాలలో. 427వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 172 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 17.27%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 968:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 68.36%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

Vernaculars spoken in Shahdol include Bagheli, which has a lexical similarity of 72-91% with Hindi[5] (compared to 60% for German and English)[6] and is spoken by about 7 800 000 people in Bagelkhand.[5]

విరాటేశ్వరాలయం

[మార్చు]

సోహగ్పూర్ బంగంగలో విరాటేశ్వరాలయం (శివాలయం) ఉంది. కల్చురి రాజా యువరాజ్ దేవా ఈ ఆలయాన్ని సా.శ. 950 - 1050 మధ్య కాలంలో నిర్మించాడని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఆచార్య గొల్కకి మఠం ఉంది. పలు ఆర్కియాలజిస్టులు ఈ అలయం కర్ణదేవాకు సంబంధించినదని భావిస్తున్నారు. 70 అడుగుల ఎత్తు ఉన్న ఈ ఆలయం కల్చురీ శిల్పకళా వైభవంతో చూపరులను ఆకట్టుకుంటుంది. ఆలయ ముఖద్వారంలో నంది విగ్రహం, సింహం విగ్రహం ఉన్నాయి. కల్చూరి కాల నిర్మాణవైభవానికి ఇది ప్రతీకగా ఉంది. ఆలయంలో మహావీరుడు, శివుడు, పార్వతి నృత్యభంగిమలో ప్రతిష్ఠించబడి ఉన్నారు. సరస్వతి, గణేశ్, విష్ణు, నృసింహ, వ్యాల్, మూల్లుని తీస్తున్న అందమైన స్త్రీ, యుద్ధవీరులు, వేణువు వాయిస్తున్న శ్రీకృష్ణుడు, వీణావాదిని, అర్ధనారిశ్వరుడు మొదలైన అద్భుతశిల్పాలు చూపరులను ఆకర్షిస్తుంటాయి. జిల్లా అందాలలో ఈ ఆలయం ఒకటి.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Cyprus 1,120,489 July 2011 est.
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Rhode Island 1,052,567
  5. 5.0 5.1 M. Paul Lewis, ed. (2009). "Bagheli: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
  6. M. Paul Lewis, ed. (2009). "English". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.

వెలుపలి లింకులు

[మార్చు]
  • [1] List of places in Shahdol

వెలుపలి లింకులు

[మార్చు]