1817
1817 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1814 1815 1816 - 1817 - 1818 1819 1820 |
దశాబ్దాలు: | 1790లు 1800లు - 1810లు - 1820లు 1830లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- జనవరి 20: రామ మోహన్ రాయ్, డేవిడ్ హేర్ లు కలకత్తాలో హిందూ కాలేజిని స్థాపించారు.
- జూన్ 12: జర్మనీకి చెందిన కార్ల్ డ్రైస్ తొలి రూపపు సైకిలును తయారు చేసాడు.
- సెప్టెంబరు 11: సిలోన్లో 1817-18 తిరుగుబాటు మొదలైంది.
- అక్టోబరు 17: బాంబేలో హెచ్ఎమ్ఎస్ ట్రింకోమలీ ఫ్రిగేట్‌ను తయారు చేసారు. రెండు శతాబ్దాల తరువాత కూడా అది నీటిలో తేలే స్థితిలోనే ఉంది.
- అక్టోబరు 30: సైమన్ బొలివర్ వెనెజులాలో స్వతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాడు.
- అక్టోబరు 31: జపాన్‌లో నిన్కో చక్రవర్తి గద్దెనెక్కాడు
- నవంబరు 5: మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం మొదలైంది
- నవంబరు 17: బ్రిటిషు వారు పూనాను స్వాధీనం చేసుకున్నారు.
- తేదీ తెలియదు: బెంగాల్లో కలరా అంటువ్యాధి మొదలైంది. సెప్టెంబరు నాటికి ఇది కలకత్తాకు పాకింది.
- తేదీ తెలియదు: బెంగాల్లో శ్రీరాంపూర్ కళాశాలను స్థాపించారు
- తేదీ తెలియదు: శృంగేరి శారదా పీఠపు 32 వ జగద్గురువు 8 వ నృసింహ భారతి పీఠాన్ని అధిరోహించాడు.
జననాలు
[మార్చు]- మే 15: దేవేంద్రనాథ్ ఠాగూర్, తత్వవేత్త (మ. 1905)
- జూన్ 30: జోసెఫ్ డాల్టన్ హుకర్, బ్రిటిష్ వృక్షశాస్త్రవేత్త (మ. 1911)
- అక్టోబరు 17: సయ్యద్ అహ్మద్ ఖాన్, ప్రత్యేక పాకిస్తాన్ దేశ ప్రతిపాదకుడు (మ. 1898)
- తేదీ తెలియదు: గోడే వెంకట జగ్గారావు, గణిత శాస్త్రవేత్త. (మ. 1856)
- తేదీ తెలియదు: శేషదాసులు వాగ్గేయకారుడు, గద్వాల సంస్థాన పాలనలో కరణం. (మ. 1885)
మరణాలు
[మార్చు]- జూలై 18: జేన్ ఆస్టెన్, ఇంగ్లీషు నవలా రచయిత్రి (జ. 1775)
- ఆగస్టు 17: వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, గుంటూరు ప్రాంతమును పరిపాలించిన కమ్మ రాజు, అమరావతి సంస్థాన పాలకుడు. (జ.1761)
- డిసెంబర్ 20: తులసిబాయి హోల్కర్, ఇండోర్ మహారాణి. భర్త మరణం తర్వాత తన కుమారుడు మల్హర్ రావ్ హోల్కర్ II తరఫున ఇండోర్ రాజ్యాన్ని 1811-1817ల మధ్య పరిపాలించింది.(జ.1788)
తేదీ వివరాలు తెలియనివి
[మార్చు]- తరిగొండ వెంగమాంబ, 18వ శతాబ్దికి చెందిన భక్త కవయిత్రి, మహా యోగిని, శ్రీవేంకటేశ్వరుని భక్తురాలు. (జ.1730)