Jump to content

సుమతి భిడే

వికీపీడియా నుండి
02:20, 29 నవంబరు 2022 నాటి కూర్పు. రచయిత: Muralikrishna m (చర్చ | రచనలు)
(తేడా) ←పాత కూర్పు | ప్రస్తుతపు కూర్పు చూపించు (తేడా) | దీని తరువాతి కూర్పు→ (తేడా)
సుమతి భిడే
జననం
సుమతి భిడే

(1932-06-05)1932 జూన్ 5
మరణం1999
జాతీయతభారతీయులు
వృత్తిమహిళా శాస్త్రవేత్తలు

సుమతీ భిడే (జూన్ 5 1932- 1999) జీవ రసాయన శాస్త్రవేత్త. ఈమె భారతీయ మహిళా శాస్త్రవేత్తల సంఘం నకు మొదటి అధ్యక్షులుగా పనిచేశారు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఈమె పూనా విశ్వవిద్యాలయంలో ఎం.యస్సీ చదివిన తర్వాత విదేశాలలో యూనివర్శిటీ ఆఫ్ బ్రుక్సెల్లెస్ లో డి.ఎస్.సి చేశారు. ఈమె ప్రత్యేకంగా కేన్సర్ వ్యాధి చికిత్సా రంగంలో పరిశోధనలు నిర్వహించారు. పొగాకు వాడకానికి, వాతావరణ కాలుష్యానికి సంబంధించి తలెత్తే వివిధ కేన్సర్ నివారణకు చికిత్సా విధానాలను శోధించారు.

డాక్టర్ సుమతి కేన్సర్ వ్యాధికి మూలకారణాలు- పుట్టకురుపును కలుగజేసే పదార్థములు, తారు/డాంబరు నుండి వెలువడే ఉత్పాదికకులు, వాహనముల నుండి వెలువడు విషవాయువులు, హైడ్రో కార్బన్ ల అంశమై పరిశోధనలు నిర్వహించారు. ఉపకళ కనముల నుండి పుట్టిన అపాయకరమైన కంతి (ఓ రకమైన పుట్ట కురుపు) నివారణకు పసుపు వినియోగాన్ని ఆవిష్కరించారు. పొగాకు సంబంధిత పదార్థములను నమిలేవారికి ఏర్పడు గొంతు కాన్సర్ చికిత్సా విధానాలను అభివృద్ధి పరిచారు.

డాక్టర్ సుమతి పరిశోధనా కృషికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, న్యూఢిల్లీ వారు అవార్డును అందించారు. కేన్సర్ పరిశోధనా రంగంలో అద్వితీయ కృషి చేసినందుకు ఐ.సి.ఎం.ఆర్. (న్యూఢిల్లీ) 1986 లో శాండజ్ ఓరేషన్ అవార్డును అందించి ఘన సత్కారం చేశారు.

పరిశోధనలు

[మార్చు]

సుమతి 1989 నుండి 1997 వరకు తమ పరిశోధన ఫలితాలను వివిధ గ్రంథ రచనలలో పొందుపరిచారు. ఈమె పరిశోధనల ముఖ్యాంశాలు:

  • Carcinogenic tabaco specific Nitrosamines in Indian tobacco products.
  • Chemical analysis of smoke of India cigarettes, bidis, and other indigenous from of smoking - levels of steam volative phends, hydrogen cyanide and benzo(x) pyrene.
  • Chemoprevention of mammary tumor virus induced and chemical carcinogen induced rodent mammary tumors, breast cancer

డాక్టర్ సుమతి పొగాకు వాడకం ద్వారా తలెత్తే వివిధ రకాల కేన్సర్ లకు చికిత్సా పద్ధతులను గణనీయంగా అభివృద్ధి చేశారు. నూతన చికిత్సా విధానాలను ఆవిష్కరించారు. 49 సంవత్సరాల పరిశోధనానుభవాన్ని గడించారు. డాక్టర్ సుమతి కేన్సర్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ లో సీనియర్ సైంటిస్ట్ గా (1962 - 78), కార్సినో జెనెసిస్ డివిజన్ కు అధిపతిగా ( 1978-92) పనిచేశారు. స్వామి ప్రకాశానంద ఆయుర్వేద డివిజన్ కు అధిపతిగా (1978-92) పనిచేశారు. స్వామి ప్రకాశానంద ఆయుర్వేద రీసెర్చ్ సెంటర్ (ముంబై) కు ప్రాజెక్టు డైరక్టరుగా పనిచేసి పదవీవిరమణ చేశారు. 1999 లో మరణించారు.

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]