వాడుకరి చర్చ:C.Chandra Kanth Rao/పాత చర్చ 2

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చంద్ర కాంత రావు ప్రస్తుతం చిన్న తెవికీ సెలవు తీసుకున్నాడు, తొందరలోనే, మరలా వికీపీడియాలో తన మార్పులు-చేర్పులు మొదలు పెడతాడు.

మీ సూచనమేరకు 'రాకేశ్ శర్మ' నందు మార్పులు చేశాను. దయచేసి రాకేష్ శర్మ పేజీ ని తీసివెయ్యండి. రాకేశ్ శర్మ ఫోటో వేస్తేనూ బాగుంటుంది. మిత్రుడుnisar 22:37, 2 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

"మీకు తెలుసా!" సమాచారం

చంద్రకాంత్! మొదటి పేజీలో "మీకు తెలుసా" మూసను మనం మెయింటెయిన్ చేయలేకపోతున్నామనీ, దానిని తొలగించాలనీ నేను ఇదివరకు రెండు సార్లు విజ్ఞప్తి చేశాను. ప్రస్తుతం ఆ పని నీవు చేబట్టడం వలన మొదటిపేజీలో పెద్ద వెలితి పూడింది. నీ శ్రమకు అభినందనలు- --కాసుబాబు 06:52, 3 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఎలాగూ నేను ప్రతి కొత్త రచనలను గమనిస్తూ ఉంటాను. ముఖ్యమైన పాయింట్లు నోట్ చేసుకుంటే చాలా రోజుల నుంచి అచేతనంగా ఉన్న శీర్షికను తాజాకరించవచ్చు ననే ఆలోచన రావడంతో ఆ పని కూడా ప్రారంభించాను.-- C.Chandra Kanth Rao(చర్చ) 18:38, 3 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
అవునండీ చంద్రకాంత్ రావు గారు! మీ కృషి అమోఘం! నేను మీరడినట్లు మూస:2003 ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు సభ్యులులో మార్పులు చేయలేకపోయాను. దానికి ప్రత్యామ్నాయంగా navbar లేకుండా చేసాను. δευ దేవా 09:08, 5 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

Archive

అలా చేస్తే ఇప్పుడు జరుగుతున్న చర్చలు ఉండవు కదా. అందికే చర్చ పేజిలో సంతకం చేయమని చెప్పేది. సాయీ(చర్చ) 13:43, 8 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

సంతకం ప్రధానం కాదు. మన సంతకం ఎవరయిననూ సులభంగా కాపీ చేయవచ్చు (అలా చేయడం తప్పే, అయిననూ చేయడానికి అవకాశం మాత్రం ఉంది). ఎవరూ మార్పుచేయడానికి వీలులేనిది కాబట్టి నా దృష్టిలో చరితమే ప్రధానం. దాని ద్వారా సంతకం చేయని కొత్త సభ్యుల సభ్యనామం/ఐపి అడ్రస్ కాకుండా దిద్దుబాటు తేడాలు కూడా ఖచ్చితంగా తెల్సుకోవచ్చు. -- C.Chandra Kanth Rao(చర్చ) 14:35, 8 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఒక వేళ క్రితం చర్చ పేజికి వెళ్ళి సంతకం కాపి చేస్తే, ఆ పేజి చరితం లో పట్టుకోవచ్చు కదా. సాయీ(చర్చ) 14:44, 8 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

క్రికెట్

CKR గారు, మీరు వ్రాస్తున్న క్రికెట్ వ్యాసాలను చూస్తుంటాను. మీ కృషి మాటల్లో చెప్పలేనిది. క్రికెట్ ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే, కాబట్టి మొదటి పేజీలో మార్గదర్శిని లో భారత దేశము దగ్గర క్రికెట్ వర్గాన్ని కూడా చేర్చితే బాగుంటుంది. మీ అభిప్రాయాలు తెలుపగలరు. - --Svrangarao 15:44, 16 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

రంగారావు గారు, క్రికెట్ ప్రాముఖ్యత గురించి మీరు చెప్పిన మాట నిజమే. అత్యధిక జనాదరణ కలిగిన అంశం కాబట్టి దీని కొరకు నాకు ఎంతో ప్రీతికరమైన ఆర్థికశాస్త్రం వ్యాసాలను కూడా ప్రక్కకు పెట్టాను. ఇక మొదటి పేజీలో క్రికెట్ వర్గాన్ని చేర్చాలనే విషయం మంచిదే. కాని మొదటి పేజీలో కేవలం క్రికెట్‌కు మాత్రమే లింకు ఇస్తే సరిపోదు అన్ని క్రీడలకు లింకులివ్వాల్సి వస్తుంది. మిగితా క్రీడల వ్యాసాలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. వ్యాసాల సంఖ్య పెరిగితే క్రికెట్‌పై వేదిక (పోర్టల్) కూడా ప్రారంభించవచ్చు. క్రికెట్ అభిమానులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. -- C.Chandra Kanth Rao(చర్చ) 16:03, 16 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

CKR గారు, మిగతా క్రీడలను పరిగణనలోకి తీసుకోవడం మంచిదే కానీ దురదృష్టవశాత్తు ఆ వ్యాసాలు లేవు, ఎక్కువమంది రాస్తారన్న నమ్మకం కూడా నాకు లేదు. ఇకపోతే, చాలా పోర్టల్స్ లో క్రికెట్‌ను మొదటిపేజీలోనే చూపుతున్నారు ఎందుకంటే దానికి అయస్కాంతత్వ గుణం ఉన్నది కాబట్టి!! ఇప్పటికే మీరు ఎన్నో వ్యాసాలు రాసారు. మిగిలిందల్లా వాటిని మొదటిపేజీ కోసం అమర్చడమే! ఇప్పటికిప్పుడు కాకపోయినా, తొందరలో చేయగలరని ఆశిస్తున్నాను.- --Svrangarao 16:25, 16 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మీ సూచనను తప్పకుండా పరిశీలిస్తాను-- C.Chandra Kanth Rao(చర్చ) 16:32, 16 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
చంద్ర కాంత రావు గారు, భారత క్రికెట్ జట్టును 28వ వారపు వ్యాసంగా ప్రతిపాదించాను. ఈ వ్యాసము చాలా పెద్దదిగా ఉండడంవల్ల కొన్ని మార్పులు చేసి మరి కొన్ని చిన్న వ్యాసాలను సృష్టించి ఈ వ్యాసంలో లింకులు ఇస్తే బాగుంటుందేమో. మీ అభిప్రాయాలు తెలియచేయగలరు. --Svrangarao 17:08, 19 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
రంగారావు గారు, మీ సూచనను పరిశీలిస్తాను.-- C.Chandra Kanth Rao(చర్చ) 19:32, 19 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఒక చిన్న మాట

చంద్రకాంత రావుగారూ! నా దురదృష్టవశాత్తూ కొన్ని వ్యక్తిగత కారణాల వలన సరిగ్గా నేను నిర్వాహక ప్రతిపాదన చేసిన తరువాతే ఇంటర్నెట్ సౌకర్యం సరిగా లభించుట లేదు. కాబట్టి నేను ఒక రెండు నెలల సమయం పాటు ఎక్కువ మార్పులు చేయలేకపోవచ్చు.అన్యదా భావించకండి. తరువాత నా సొంత ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకొంటే యధావిధిగా మార్పులు చేయగలను. రవిచంద్ర ఉత్సాహంగా పనిచేస్తున్నాడు, అని మిగతా నిర్వాహకులు కూడా నాకు మద్దతు తెలిపారు. ఎక్కువ దిద్దుబాట్లు చెయ్యలేకపోతున్నందుకు బాధగా ఉంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. రవిచంద్ర(చర్చ) 13:14, 17 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఫరవాలేదు. మీకు వీలున్నప్పుడే చేయండి.-- C.Chandra Kanth Rao(చర్చ) 13:19, 17 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
మంచి పనిచేశారు. ఇక నుంచి ఆంగ్ల వ్యాసాలు తెవికీలో ఉంచకుండా పూర్తిగా తెలుగులో అనువాదం చేయండి. ఆంగ్ల వికీలో ఉన్నది ఉన్నట్లుగా మొత్తం వ్యాసం అనువాదం చేయాల్సిన అవసరం లేదు.సంక్షిప్తంగానూ చేయవచ్చు. తెవికీలో ఇప్పటికే చాలా ఆంగ్ల వ్యాసాలున్నాయి. వాటిని తొందరలోనే తొలిగించే పని చేపడతాను.-- C.Chandra Kanth Rao(చర్చ) 18:27, 26 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అసెంబ్లీ నియోజకవర్గాలు

చంద్రకాంతరావు గారికి ధన్యవాదాలు. అసెంబ్లీ నియోజక వర్గాల వివరాలు చేరుస్తున్నందుకు. వాటి యొక్క మూలాన్ని కూడా చేరిస్తే ఇంకాబాగుంటుంది.Rajasekhar1961 15:03, 20 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

రాజశేఖర్ గారు నేను వార్తా పత్రికల జిల్లా ఎడిషన్లలో వచ్చిన సమాచారం ఆధారంగా ఆ పేజీలు తయారుచేశాను. ఇంకనూ ఆ సమాచారం ఎన్నికల కమీషన్ వెబ్‌సైట్‌లో పెట్టలేదు. వార్తాపత్రికలకు రెఫరెన్సు ఇవ్వడం బాగుండదు. ఒకే సారి వెబ్‌సైట్ రెఫరెన్సే పెడదాం. వాటన్నింటినీ బాటు ద్వారా ఒకే సారి పెట్టవచ్చు. నేను మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి (అసంపూర్తి) జిల్లాల నియోజకవర్గాలు చేర్చాను. మీకు అందుబాటులో ఉంటే మిగితా జిల్లాల సమాచారం కూడా చేర్చండి. నేను కూడా ప్రయత్నిస్తాను.---- C.Chandra Kanth Rao(చర్చ) 19:40, 20 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు

అధికారి హోదాకై నేను చేసిన విజ్ఞప్తికి మద్దతిచ్చినందుకు ధన్యవాదాలు. __మాకినేని ప్రదీపు (+/-మా) 17:23, 20 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ముందు అడుగు తప్పని సరి

రావు గారు! నేను కొత్త సభ్యడ ను మీ సూచన కు ధన్యవాదములు!! మొదటి అడుగు లేకుండా ప్రయాణము పూర్తి కాదు!!! సాంతికశాస్త్రము లు చదివిన చదువుచున్న మిత్రుల సహయసలహలతో పూర్తి చేయవలసిన సుదూర ప్రయాణము. గమనించగలరు---తిరుమల శ్రీనివాస్ 00:14, 29 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంగ్ల భాగం తొలగింపు

చంద్ర కాంత రావు గారు, మొదటి తెవికీ చూసినపుడు నాకు కూడా అలాంటి అభిప్రాయమే కలిగింది. కొన్నాళ్ళు చూసి ఆగలేక తుడిచివేత మొదలు పెట్టాను. మీరు చెబుతున్నట్లు నేను వీలయినంతవరకు ఆ వ్యాస చరిత్ర చూసిన తరువాతే డిలీట్ చేయడం మొదలు పెట్టాను. మరింత క్షుణ్ణంగా పరిశీలించడానికి ప్రయత్నిస్తాను. ఒకట్రెండు వ్యాసాలలో ఒక్క తెలుగు అక్షరం కూడా లేకపోవడంతో, ఆ పేజీ ఎలా తొలగించాలో తెలియక అందులోని విషయం మొత్తం తీసివేసాను. ఉదా: తొమ్మిది. మీరొకసారి పరిశీలించగలరు. --Svrangarao 23:27, 29 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కృతజ్ఞతలు

నా స్వీయ నిర్వాహక హోదాకు మద్దతు తెలిపినందుకు ధన్యుడను - రవిచంద్ర(చర్చ) 04:39, 30 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మెదటి పేజి

ఈ పేజి చూసి, మీ అభిప్రాయం తెలుపగలరు. సాయీ(చర్చ) 07:56, 30 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నోబెల్ బహుమతి

మూస:నోబెల్ బహుమతి విజేతలైన భారతీయులు బదులు నోబెల్ బహుమతి గెలుచుకొన్న భారతీయులు అంటే బాగుంటుంది కాదా. సాయీ(చర్చ) 10:51, 30 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నోబెల్ బహుమతి పొందిన భారతీయులుగా మార్చాను.-- C.Chandra Kanth Rao(చర్చ) 14:08, 30 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వారం సమైక్య కృషి

చంద్రకాంత్ గారూ! ఈ వారం సమైక్య కృషిని నడిపించే మార్గంలో వికీపీడియా:ఈ వారం సమైక్య కృషి తయారు చేసాను, మూస:ఈ వారము సమైక్య కృషిలో కూడా మార్పులు చేసాను. ఇకనుండి తెలుగు వికీపీడియాలో ఉన్న మొలకలను అరికట్టడానికి కృషి చేద్దాం. ఇది సఫలీకృతం కావాలంటే దీనికి మీ కృషి చాలా అవసరం. δευ దేవా 20:10, 17 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

దేవా గారు! నా వంతు కృషి తప్పకుండా చేస్తాను. మరి కొన్ని వారాల వరకు నేను తెవికీ సెలవులోనే ఉండగలనేమో! పునరాగమనం తరువాత నా వంతు ప్రయత్నం చేయగలను.-- C.Chandra Kanth Rao(చర్చ) 18:43, 18 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ పాలసీలపై ఒక చర్చ

వికీపీడియా:రచ్చబండ (పాలసీలు) పేజీలో నేను తెలుగువికీలో, ఆంగ్లవికీ పాలసీలను వాడుకునే బదులుగా మనమే సొంతంగ పాలసీలను తయారు చేసుకోవాలని ప్రతిపాదించాను. అందుకు మీరు మీ అభిప్రాయాలను అక్కడ తెలుపాలని మనవి. __మాకినేని ప్రదీపు (+/-మా) 07:41, 29 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]