2006
2006 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 2003 2004 2005 - 2006 - 2007 2008 2009 |
దశాబ్దాలు: | 1980లు 1990లు - 2000లు - 2010లు 2020లు |
శతాబ్దాలు: | 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం - 22 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు- జూన్ 9: ప్రపంచ కప్ సాకర్ పోటీలు జర్మనీలో ప్రారంభమయ్యాయి.
- సెప్టెంబర్ 15: 14వ అలీన దేశాల సదస్సు క్యూబా రాజధాని నగరం హవానాలో ప్రారంభమైనది.
- డిసెంబర్ 1: 15వ ఆసియా క్రీడలు దోహలో ప్రారంభమయ్యాయి.
- డిసెంబర్ 30: ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దామ్ హుసేన్‌ను ఉరితీసారు.
జననాలు
మార్చుమరణాలు
మార్చు- ఫిబ్రవరి 4: రాజ్ వీర్ సింగ్ యాదవ్, భారతదేశపు మొట్టమొదటి మూత్రపిండ మార్పిడి శస్త్రవైద్యుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (జ.1937)
- మార్చి 26: దుక్కిపాటి మధుసూదనరావు, సినీ నిర్మాత. (జ.1917)
- ఏప్రిల్ 12: రాజ్‌కుమార్, భారత చలనచిత్ర నటుడు, గాయకుడు. (జ.1929)
- ఏప్రిల్ 19: సర్దార్ గౌతు లచ్చన్న, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఆంధ్ర రాష్ట్ర మంత్రి,స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1909)
- ఏప్రిల్ 29: జాన్ కెన్నెత్ గాల్‌బ్రెత్, ఆర్థికవేత్త. (జ.1908)
- మే 6: తిక్కవరపు పఠాభిరామిరెడ్డి, రచయిత, సినిమా నిర్మాత. (జ.1919)
- జూన్ 4: బూదరాజు రాధాకృష్ణ, భాషావేత్త. (జ.1932)
- జూలై 1: కొరటాల సత్యనారాయణ, ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమ నేత. (జ.1923)
- జూలై : గడియారం రామకృష్ణ శర్మ, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సాహితీవేత్త. (జ.1919)
- జూలై 8: రాజారావు, ఆంగ్ల నవలా, కథా రచయిత. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత. (జ.1908)
- ఆగష్టు 4: నందిని సత్పతీ, ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి (జ.1931)
- ఆగష్టు 12: మల్లవరపు జాన్, తెలుగు కవి. (జ.1927)
- ఆగష్టు 15: జి. వి. సుబ్రహ్మణ్యం, వైస్ ఛాన్సలర్, ఆచార్యుడు. (జ.1935)
- ఆగష్టు 18: కొండపల్లి పైడితల్లి నాయిడు, 11వ, 12వ, 14వ లోక్‌సభ లకు ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు. (జ.1930)
- ఆగష్టు 28: డి.వి. నరసరాజు, రంగస్థల, సినిమా నటుడు, రచయిత, దర్శకుడు. (జ.1920)
- సెప్టెంబరు 28: ఎస్.వి.ఎల్.నరసింహారావు, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1911)
- అక్టోబర్ 3: ఇ.వి.సరోజ, 1950, 60 వ దశకపు తమిళ, తెలుగు సినిమా నటి, నాట్య కళాకారిణి. (జ.1935)
- అక్టోబర్ 13: హీరాలాల్ మోరియా, పత్రికా రచయిత, నవలా రచయిత, సమరయోధుడు. (జ.1924)
- నవంబరు 11: కప్పగంతుల మల్లికార్జునరావు, కథా, నవలా, నాటక రచయిత. (జ.1936)
- నవంబర్ 16: మిల్టన్ ఫ్రీడ్మన్, అమెరికాకు చెందిన ఆర్థికవేత్త, నోబెల్ బహులతి గ్రహీత. (జ.1912)
- నవంబర్ 22: అసీమా చటర్జీ, భారతీయ మహిళా రసాయన శాస్త్రవేత్త. (జ.1917)
- నవంబర్ 26: జి.వరలక్ష్మి, తెలుగు సినిమానటి. (జ.1926)
- డిసెంబర్ 30: పేకేటి శివరాం, తెలుగు సినిమా నటుడు. (జ.1918)