మిన్నికంటి గురునాథశర్మ

మిన్నికంటి గురునాథశర్మ గుంటూరు జిల్లాకు చెందిన పండితుడు. ఇతని తల్లిదండ్రులు వెంకట సుబ్బమాంబ, మిన్నికంటి వెంకట లక్ష్మణమంత్రి. శ్రీవత్స గోత్రుడు. ఇతడు ఏల్చూరు గ్రామంలో 1897, ఏప్రిల్ 10వ తేదీన జన్మించాడు. ఉభయ భాషా ప్రవీణుడు. వేదాంత పారీణుడు. తెనాలిలో విద్యాభ్యాసం చేశాడు. గుంటూరులోని హిందూ కాలేజీ హైస్కూలులో ప్రధాన ఆంధ్రపండితుడిగా పనిచేశాడు. ఇతడు పోతరాజు విశ్వనాథ కవితో కలిసి గురువిశ్వనాథకవులు పేరుతో జంటగా కవిత్వం చెప్పాడు. ఇతడు సాహిత్యంతో పాటు భక్తి, వేదాంత రచనలు మొత్తం 66కు పైగా రచించాడు. వాటిలో పద్య, గద్య, నాటక, హరికథ, విమర్శ, సుప్రభాత, ఆధ్యాత్మిక విచార, వ్రతకల్ప, అనువాద, పరిశోధక, వ్యాకరణ, వ్యాఖ్యాన గ్రంథాలు వున్నాయి.

రచనలు

మార్చు
  1. తత్త్వ విచారము
  2. జీవ విచారము
  3. నామసంకీర్తనము
  4. ఆంధ్రశ్రుతి గీతలు
  5. అడవిపువ్వులు[1]
  6. సూక్తినిధి
  7. దత్తమహిమ
  8. శ్రీదత్తాత్రేయ వ్రతకల్పము
  9. విశిష్టాద్వైత విచారము
  10. హరిహర దత్తస్తుతి
  11. శాస్త్రార్థ విచారము
  12. శివగీత
  13. గౌరీకళ్యాణము
  14. కంచెర్ల గోపన్న అను రామదాసు
  15. శ్రీ మద్భాగవత మహిమ[2]
  16. శ్రీమద్గురు భాగవతము
  17. అమ్మ

బిరుదులు

మార్చు
  • ఉభయ భాషాప్రవీణ
  • వేదాంత పారీణ
  • కవిశేఖర
  • విద్యానాథ
  • కవితామహేశ్వర

ఇతడు 1984, డిసెంబరు 10వ తేదీన మరణించాడు.

మూలాలు

మార్చు