బి. జయనాగేశ్వర రెడ్డి

బి. జయనాగేశ్వర రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో ఎమ్మిగనూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

బైరెడ్డి జయనాగేశ్వర రెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014 - 2019
నియోజకవర్గం ఎమ్మిగనూరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1 ఏప్రిల్ 1981
ఉలిందకొండ, కల్లూరు మండలం, కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు బి.వి. మోహన్ రెడ్డి, నాగమణి
జీవిత భాగస్వామి నిత్యాదేవి

జననం, విద్యాభాస్యం

మార్చు

బి. జయనాగేశ్వర రెడ్డి1 ఏప్రిల్ 1981లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, కల్లూరు మండలం, ఉలిందకొండలో జన్మించాడు. ఆయన ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు అనంతపురంలోని లాల్ బహదూర్ పాఠశాలలో, ఇంటర్మీడియట్ కూడా అనంతపురంలోనే పూర్తి చేసి హైదరాబాద్ డెక్కన్ కళాశాలలో ఎంబిబిఎస్ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

మార్చు

బి. జయనాగేశ్వర రెడ్డి తన తండ్రి బి.వి. మోహన్ రెడ్డి మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మిగనూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి జగన్ మోహన్ రెడ్డి పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1] బి. జయనాగేశ్వర రెడ్డి 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మిగనూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కె. చెన్నకేశవ రెడ్డి చేతిలో ఓడిపోయాడు.

ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో ఎమ్మిగనూరు నుండి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2]

మూలాలు

మార్చు
  1. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  2. BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.