పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్

ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడు, రాష్ట్ర మంత్రి

పోలుబోయిన అనిల్ కుమార్ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయనాయకులు. నెల్లూరు పట్టణ శాసనసభ నియోజకవర్గం నుండి 2014లో శాసనసభ్యునిగా ఎన్నికైనాడు[4].

పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్
పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్


పదవీ కాలం
8 జూన్ 2019[1] – 2022 ఏప్రిల్ 10[2]
ముందు ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి
నియోజకవర్గం నెల్లూరు పట్టణ శాసనసభ నియోజకవర్గం

ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014 - 2024

వ్యక్తిగత వివరాలు

జననం (1980-03-23) 1980 మార్చి 23 (వయసు 44)
కొత్తూరు, అంబాపురం, నెల్లూరు జిల్లా [3]
రాజకీయ పార్టీ YSR కాంగ్రెస్
తల్లిదండ్రులు పోలుబోయిన తిరుపాలయ్య , శైలమ్మ
జీవిత భాగస్వామి జాగృతి
సంతానం పాప సమన్వి , బాబు ధర్మనందన్‌
నివాసం నెల్లూరు జిల్లా

జీవిత విశేషాలు

మార్చు

అతను 1980 మార్చి 23న పోలుబోయిన తిరుపతయ్య, శైలమ్మ దంపతులకు జన్మించాడు. అతని బాబాయి సుధాకర్‌ మృతితో రాజకీయాల్లోకి వచ్చాడు. 2008లో అనూహ్యంగా రాజకీయ ప్రవేశం చేసిన అతను వెనుదిరిగి చూడలేదు. అప్పటి కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేటర్‌గా తన ప్రస్తానం ప్రారంభించారు. కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్న దశలో దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణించడంతో జగన్‌తోపాటే వైసీపీలో చేరాడు. 2014లో ఆ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందాడు.

2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో నెల్లూరు పట్టణ శాసనసభ నియోజకవర్గం నుండి వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందాడు. వై.ఎస్. జగన్మోహనరెడ్డి మంత్రివర్గంలో నీటివనరుల శాఖా మంత్రిగా భాద్యతలను 2019 జూన్ 8 నుండి చేపట్టాడు.[5][6][7][1]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 TV5 News (8 June 2019). "ఏపీ మంత్రుల ప్రొఫైల్." (in ఇంగ్లీష్). Archived from the original on 5 January 2022. Retrieved 5 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Prajasakti (10 April 2022). "రాజీనామాలను ఆమోదించిన గవర్నర్". Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
  3. Sakshi (18 March 2019). "నెల్లూరు బరిలోని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వీరే". Archived from the original on 5 January 2022. Retrieved 5 January 2022.
  4. "పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్". 2019-01-24.[permanent dead link]
  5. "Andhra Pradesh Assembly election result: Full list of winners". financialexpress.
  6. "Following in the footsteps of his father". The Hindu.
  7. "Goutham, Anil to secure place in Cabinet". Hansindia.

బయటి లంకెలు

మార్చు