ఖండోబా
ఖండోబా (IAST: Khaṇḍంbā), మార్తాండ భైరవ లేదా మల్హరి, హిందూ దైవం. అతను భారతదేశంలోని దక్కను పీఠభూమి పై శివుని అవతారంగా భావించబడిన దైవం. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలలో ఎక్కువగా కొలుస్తుంటారు. మహారాష్ట్రలో అతను ముఖ్యమైన కులదైవం.[1] అతను బ్రాహ్మణులు, క్షత్రియులు, వ్యవసాయదారులు, పశుపోషకులు వంటి కులాలకే కాకుండా అడవుల్లో, కొండ ప్రాంతాల్లోని గిరిజన, వేటాడే తెగలకు కూడా ఆరాధ్య దైవం. ఖండోబా పూజలు హిందూ, జైన మత పద్ధతులలో జరుగుతాయి. ఖండోబా పూజా విధానం కుల భేదం లేకుండా ముస్లింలతో సహా అందరూ అతనికి చేరువకావడానికి వీలుకల్పించింది. ఖండోబా ఆరాధన 2వ శతాబ్ది నుంచి పదో శతాబ్ది వరకు అభివృద్ధి చెందింది. ఈ దేవుని జానపద దైవంగా శివునిగా, భైరవునిగా, సూర్యునిగా, కార్తికేయునిగా కూడా భావిస్తారు. ఖండోబాను లింగరూపంలోనూ, ఎద్దుని కానీ, గుర్రాన్ని కానీ అధిష్టించిన యోధునిగానూ చిత్రీకరించడం ఉంది. మహారాష్ట్రలోని జిజూరి ఖండోబా ఆరాధనకు ముఖ్య కేంద్రంగా ఉంది. ఇతిహాసాలలో ఖండోబా గురించి మల్హరి మహాత్మ్య గ్రంథంలో, జానపద పాటలలో వివరించారు.
ఖండోబా | |
---|---|
దేవనాగరి | खंडोबा |
సంస్కృత అనువాదం | Khaṇḍobā |
అనుబంధం | శివుని అవతారం |
నివాసం | జెజూరి |
మంత్రం | ఓం శ్రీ మార్తాండ్ భైరవై నమః |
ఆయుధములు | త్రిశూలం, ఖడ్గం |
భర్త / భార్య | మహాలాస , బనై |
వాహనం | గుర్రం |
శబ్దవ్యుత్పత్తి , ఇతర పేర్లు
మార్చు"ఖండోబా" అనే పేరు "ఖడ్గ" అనే పదం నుండి వ్యుత్పత్తి అయినది. ఖండోబా ఉపయోగించే ఆయుధం (ఖడ్గం) రాక్షసులను సంహరించడానికి, ఇక "బా" అనగా తండ్రి. "ఖండెరాయ" అనగా "ఖండోబా రాజు". "ఖండేరావు" అనీ అంటారు, ఇందులో పరలగ్నం "రావు" అనగా రాజు అని అర్థం.
సంస్కృత గ్రంథాలలో ఖండోబా అనగా మార్తాండ భైరవుడు లేక సూర్యుడు. సూర్యదేవుడు, మార్తాండుడు, శివుడు కలిసిన రూపం భైరవుడు.
"మల్లరి" లేదా "మల్హరి" అనేపదం "మల్ల", "అరి" (శత్రువు) కలసిన రూపం. దీని అర్థం "మల్ల అనే రాక్షసుని యొక్క శత్రువు". మల్హరి మహాత్మ్య గ్రంథాలను బట్టి మార్తాండ బైరవుడు "మల్ల" యొక్క దైర్యసాహసాలను మెచ్చుకొని తన పేరును "మల్లరి" (మల్ల యొక్క శత్రువు) గా తీసుకున్నాడు.[2] ఇతర నామాలలో మల్లన్న, మైలర అనేవికూడా ఉన్నాయి.
ఖండోబా కొన్ని సార్లు తెలంగాణలో మల్లన్న గాను, ఆంధ్ర ప్రదేశ్లో మల్లిఖార్జున స్వామిగానూ, కర్ణాటకలో మైలార గానూ గుర్తించబడుతున్నాడు.[3]
చిత్ర సమాహారం
మార్చుఖండోబా యొక్క ప్రముఖ తైలవర్ణ చిత్రంలో[4] మాల్సా ఖండోబా ఎదురుగా తెల్లని గుర్రంపై కూర్చున్నది. మల్సా రాక్షసుని ఛాతీపై ఈటెతో పొడుస్తుంది. ఒక కుక్క రాక్షసుని తొడపై కరుస్తుంది. గుర్రం తలపై కొడుతుంది. మరియొక రాక్షసుడు గుర్రం యొక్క కళ్ళేన్ని పట్టుకుని గదతో ఖండోబాపై దాడి చేస్తాడు. ఖండోబా గుర్రంపై నుండి కిందికి దిగుతూ కత్తిలో ఆ రాక్షసునిపై దాడి చేస్తాడు. ఇతర చిత్ర రూపాలలో రాక్షసుల తలలపై కాళ్ళు గల గుర్రంపై కూర్చుంటాడు. లేదా రాక్షసుల తలలు ఖండోబా మోకాలి క్రింద ఉంటాయి.[5]
విగ్రహాలలో ఖండోబా లేదా మల్హర నాలుగు చేతులను కలిగి ఉండి వాటితో డమరుకం, త్రిశూలం, భండార పాత్ర, ఖడ్గాన్ని కలిగి ఉంటాడు. ఖండోబా చిత్రాలలో తరచుగా మరాఠా సర్దార్ వస్త్రధారణ కలిగి ఉంటుంది.[6] లేదా ముస్లిం పఠాన్ దుస్తులు కలిగి ఉంటుంది. తరచుగా ఖండోబా యోధినిగా ఒక గుర్రంపై గానీ లేదా తన భార్యలతో గానీ ఉన్నట్లు కనిపిస్తుంటాడు. కొన్ని చిత్రాలలో ఒకటి లేదా ఎక్కువ కుక్కలతో పాటు గుర్రంపై ఉన్న యోధునిగా కనిపిస్తాడు.[7] ఖండోబాను శివలింగ రూపంలో కూడా కొలుస్తుంటారు.[8] ఖండోబా దేవాలయాలలో తరచుగా రెండు రకాలు ఉన్నాయి. వాటిలో లింగం, మానవరూప గుర్రంపై ఉన్న రూపం.[7]
ఇతిహాసాలు
మార్చుసాధారణంగా ఇతిహాసాల ప్రకారం దేవుడు (ఖండోబా), రాక్షసులు (మల్ల, మణి) ల మధ్య యుద్ధంగా చెప్పబడింది. మల్హరి మహాత్య్మం అనే గ్రంథం దీనికి ప్రధాన వ్రాత వనరు. సంస్కృతంలో వ్రాయబడిన బ్రహ్మాండ పురాణంలో గల క్షేత్ర-ఖండ అనే అధ్యాయం నుండి ఖండోబా గురించి చెప్పబడింది. కానీ పురాణాల యొక్క ముఖ్య గ్రంథాలలో ఈ విషయాలు లేవు.[9] ఆర్.సి ధేరే, సొంథెర్మెర్ సంస్కృత మహాత్మ్యం అనేది 1460-1510 AD కాలంలో దేశాస్థ బ్రాహ్మణులు వారి కులదైవంగా ఖండోబాగా భావించారని వెల్లడించారు.[10] సిద్ధపల్ కేశశ్రీ (1585) చే మరాఠీలో రచించబడిన విషయాలలో కూడా ఈ విషయాలు చెప్పబడినాయి.[11] తరూవాత గల యితర గ్రంథాలైన జయాద్రి మహాత్య్మం అంరియు మార్తాండ విజయ లలో కూడా వనరున్నాయి. వీటిని గంగాధరుడు 1821 లోరాసాడు.[12] మౌఖికంగా అనేక కథలు చెప్పబడినాయి.[13]
ఇతిహాసం ప్రకారం "మల్ల" అనే రాక్షసుడు, అతని తమ్ముడు "మణి" బ్రహ్మ దేవుని నుండి వరాలను పొందారు. భూమిపై గందరగోళం సృష్టిస్తూ ఋషులను యిబ్బందులకు గురిచేస్తుంటారు. ఇంద్రుడు, విష్ణువులు వారిని సంహరించడానికి తగు సమర్థ్యం వారివద్ద లేదని అంగీకరించిన తరువాత సప్తర్షులు శివుని వద్దకు వెళ్ళి రక్షణ కల్పించవలసినదిగా వేడుకున్నారు. అపుడు శివుడు "మార్తాండ బైరవ" అవతారాన్ని పొందాడు. ఈ మహాత్య్మాన్ని ఖండోబాగా పిలుస్తారు. శివుడు నందిపై కూర్చుని దేవతల సైన్యానికి నాయకత్వం వహిస్తాడు. మార్తాండ భైరవుడు బంగారంలా మెరిసే సూర్యునిగానూ, పసుపుతో కప్పబడినట్లుగా వర్ణింపబడ్డాడు. ఈ రూపాన్ని హరిద్రగా పిలుస్తారు.[14] మూడు కన్నులతో నెలవంకనుతలపై ధరిస్తాడు.[15] రాక్షసుల సైన్యం కుక్కలచే వధించబడి చివరకు మల్ల, మణి అనే రాక్షసులను ఖండోబా వధిస్తాడు. మరణిస్తున్నప్పుడు మణి పశ్చాతాపంతో తన తెల్లని గుర్రాన్ని ఖండోబాకు ఇచ్చి ఒక వరాన్ని కోరుతాడు. ఖందోబా యొక్క ప్రతీ విగ్రహం ఎదుట తాను ఉండే విధంగా, మానవ-దయ ఉత్తమమైనదిగానూ, మేక మాంసాన్ని అర్పించాలనే వరాన్ని కోరుతాడు. అతడు కోరిన వరాన్ని ఖండోబ అనుగ్రహిస్తాడు. ఆ విధంగా ఖండోబా అర్థనారీశ్వరునిగా మారాడు. మల్ల కూడా దేవుని ఒక వరాన్ని కోరుతాడు. ప్రపంచాన్ని నాశనం చేయాలని, మానవ మాంసాన్ని కోరుతాడు. రాక్షసుని అభ్యర్థనకు కోపగించిన ఖ్ండోబా అతని తలను ఖండిస్తాడు. ఆ తల దేవాలయం యొక్క మెట్లపై పడింది. ఈ పురాణం ప్రేం పురిలో రెండు లింగాలు ఎలా ఏర్పడ్డాయో కూడా వర్ణించింది..[16][17]
వివిధ కథలలో ఖండోబాను జానపద దైవంగా శివుని యొక్క 11వ అవతారంగా చెబుతారు. ఖండోబా భార్యలు మాల్సా, బనైలు శివును యొక్క భార్యలు అయిన పార్వతి, గంగాదేవిలతో పోచ్లుతారు. లింగావత్ వాణి మల్సా సోదరుడు అయిన హెగాడి ప్రధాన్[18], విశ్వాసపాత్రమైన కుక్క ఖండోబాకు రాక్షసులను సంహరించడానికి సహాయపడతారు. గుర్రాన్ని రాక్షసుడైన మణి అందించాడు. హెగాడి ప్రధాన్, విశ్వాసపాత్రమైన కుక్క, గుర్రం, రాక్షస సోదరులను వరుసగా విష్ణువు, కృష్ణుడు, నంది, మధుకైకభులుగా భావిస్తారు.
భార్యలు
మార్చుఖండోబాకు ఇద్దరు భార్యలు వివిధ కులాలకు చెందినవారు. దేవునికి, కులాలకు మధ్య సాంస్కృతిక సంబంధమున్నది. అతనుకు గల ఇద్దరు భార్యలలో మాల్సా, బనై/బాను/బనుబాయి ముఖ్యమైనవారు.[19] ఖండోబా భార్యలలో మాల్సా లింగాయత్ వైశ్య (బనియ, బణజిగ, బలిజ) కులానికి చెందినది, రెండవ భార్య బనై యాదవ కులానికి చెందినది. వీరిలో మల్సాను సాంప్రదాయక పద్ధతులలో వివాహం చేసుకున్నాడు. బనైని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. మల్సా అసూయ గలది, మంచి వంటలు చేయగలది. బనైకు వంటలు రావు. తరచుగా వారిద్దరిమధ్య గొడవలు వస్తూండేవని కథలు ఉన్నాయి. మల్సా "సంస్కృతి"ని , బనై "ప్రకృతి"ని సూచిస్తుంటాయి. వారిద్దరి మధ్య ఖండోబా కొలువై ఉంటాడు.[20]
ఖందోబా భార్యలలో మల్సా హిందూ దేవతలైన మోహిని , పార్వతి యొక్క ఉమ్మడి అవతారంగా చెబుతారు. ఆమె ధనికుడైన వ్యాపారి అయిన తీర్మార్‌సేఠ్ కు కుమార్తెగా జన్మించింది. దేవుని ఆదేశాల మేరకు ఖండోబా తీర్మర్ సేఠ్ కలలో కనిపించాడు. అతను కుమార్తెను ఖండోబా పుష్య పౌర్ణమి నాడు వివాహం చేసుకున్నాడు. ఆ కార్యక్రమంలో రెండు శివలింగాలు కనిపించాయి. ఈ కార్యక్రమాన్ని వార్షిక పండుగగా ప్రతీ పుష్య పౌర్ణమి నాడు జరుపుకుంటారు.
ఖండోబా భార్యలలో రెండవది బనై దేవరాజు ఇంద్రుని కుమార్తెగా చెబుతారు. క్రోధితుడైన ఇంద్రుడు ఈమెను భూమిపై వదిలివేసినపుడు యాదవులకు దొరుకుతుంది. ఆమె పెరిగి పెద్దదైన తరువాత ఆమెకు "జెరూరి" వద్ద వివాహమవుతుందని జ్యోతిషం చెబుతారు. అక్కడ ఆమె ఖండోబాతో ప్రేమలో పడుతుంది. అతను మొదటి భార్య మల్సాతో చదరంగం ఆడుతున్నపుడు అందులో ఓడిపోయినందున 12 సంవత్సరాలు దూరంగా ఉంటాడు. అతను గొర్రెల కాపరి యొక్క మారువేషంలో పాల్గొని బనాయి తండ్రికి సేవలను ప్రారంభించాడు. ఒకరోజు ఖండోబా మందలోని అన్ని గొర్రెలను, మేకలను చంపుతాడు. బనై తండ్రి తన కుమార్తెను వివాహం చేస్తే అన్నింటిని మరల బతికిస్తానని చెబుతాడు. అయిష్టంగా అతను వివాహానికి అంగీకరిస్తాడు. వివాహం జరిగిన తరువాత తన నిజ రూపాన్ని అతనుకు తెలియజెస్తాడు. ఇంటికి వచ్చిన తరువాత మొదటి భార్య మల్సా ఖండోబా రెండవ వివాహాన్ని వ్యతిరేకిస్తుంది. భార్యల తగవులను పరిష్కరించడానికి ఖండోబా కొండ యొక్క పై భాగాన్ని మల్సాకు, దిగువ భాగాన్ని "బనై"కి ఇస్తాడు. అందువలన కొండ పై భాగంలో ఖండోబాతో పాటు అతని పెద్ద భార్య మల్సాతో కూడిన విగ్రహాలు ఉంటాయి. కొండ దిగువ భాగంలో గల విగ్రహాలలో అతని రెండవ భార్యతోపాటు దర్శనమిస్తాడు.
ఇతర ప్రాంతాల్లో, ఇతర గుర్తింపులతో
మార్చుఆంధ్రప్రదేశ్ లో మల్లన్న (మల్లిఖార్జునుడు), కర్ణాటక రాష్ట్రంలో మైలార అనే దేవుళ్ళని ఖండోబాగా కొందరు పరిశోధకులు భావిస్తారు. బ్రాహ్మణ హత్యతో సంబంధమున్న "భైరవుడు"గా కూడా ఖండోబాను భావిస్తుంటారు.[21] ఆరాధకులు ఖండోబాను పాక్షిక అవతారాలైన భైరవుడు లేదా వీరభద్రునిగా కాకుండా శివుని యొక్క సంపూర్ణ అవతారంగా భావిస్తుంటారు. అతను రాక్షస రాజు యొక్క గుర్రం, ఆయుధాలు, రాజ చిహ్నాలను స్వీకరించాడు.[22] సాధారణ కథల ప్రకారం ఖండోబా విగ్రహాలు చెదల పుట్టలు లేదా భూమితో తయారైనవిగా ఉంటాయి.[23] సాంధైమర్ చెప్పిన ప్రకారం మార్తాండ భైరవుడు (ఖండోబా) సూర్యుడు, శివుడి అవతారాల సమ్మిళిత అవతారం.[24][25] ఆదివారాలు, బంగారం, పసుపు అనునవి సాంస్కృతికంగా సూర్యునితో సంబంధం కలవి. ఇవి ఆచారాల ప్రకారం ఖండోబాకు ముఖ్యమైనవి.[24][25]
మరో సిద్ధాంతం ప్రకారం కార్తికేయుడే (స్కాందుడు) ఖండోబా అంటారు.[26] కార్తికేయునికి, ఖండోబాకి మధ్య గల వివిధ పోలికబట్టి ఈ సిద్ధాంతం ప్రతిపాదించారు. వీరిద్దరూ పర్వతాలతో, యుద్ధంతో సంబంధం కలిగి ఉన్నారు. వారి ఆయుధాలు ఒకలాంటివే, వారిద్దరికీ ఇద్దరు భార్యలున్నారు.[27] కుక్కతో, గుర్రంతో కూడా వీరిద్దరికీ సంబంధం కలిగి ఉంది.[28] ఈ ఇద్దరు దైవాలకు చంపా షష్టి, సుబ్రహ్మణ్య షష్టి అనే పండగల విషయంలో కూడా సామ్యం ఉంది. ఈ రెండు పండగలూ ఒకే రోజు వస్తాయి.[29]
ఆరాధన
మార్చుమహారాష్ట్రలో శివుని అసలు రూపంలో ఆరాధిస్తారు. మహారాష్ట్రలోని కొన్ని కులాలలో శివుని అవతారంగా ఖండోబాను ఆరాధిస్తారు.[30] మహారాష్ట్రలో ముఖ్యమైన కులదైవంగా ఖండోబాను భావిస్తుంటారు.[1] దక్కను పీఠభూమిలో ఆరాధిస్తున్న దేవతలలో ఎక్కువమంది కొలుస్తున్న ముఖ్యమైన దైవం ఖందోబా.[30] హిందువులలో మరాఠీలు ఎక్కువగా ఖండోబాను కొలుస్తుంటారు. కొన్ని బ్రాహ్మణ కులాలు, బోయలు . అడవులలో వేటగాళ్ళు, వైశ్య జాతి వారైన బనియాలు లేదా బణజిగలు లేదా బలిజలు,, శూద్యులు ఖండోబాను యోధుడు, వ్యవసాయం, పశుపోషణకు సంబంధించిన దైవంగా భావిస్తారు. దక్కన్ లోని మరాఠాలు, బునాబీలు, దంగర్ యాదవులు, గ్రామ రక్షకులు, రమోషీ కాపలాదారులు వంటి గుర్తించబడని గిరిజనులకు ఖండోబా సంప్రదాయం ప్రధానంగా రైతు వర్గాలను కలిగి ఉంటుంది.[31][32] పూర్వం అంటరానివారుగా భావించిన మహార్లు, మంగ్ లు, బోయవాళ్ళు, తోటమాలి, దర్జీ వృత్తివారు, కొంతమంది బ్రాహ్మణులు, కొంతమంది ముస్లింలు కూడా ఖండోబాను ఆరాధిస్తారు.[33][34]
ఆరాధనలు , ప్రార్థనా పద్ధతులు
మార్చుఖండోబా ఒక కదాక్ (భీతి) దేవత అని నమ్ముతారు, అతను కుటుంబానికి విధులు ప్రకారం సరిగా ప్రవర్తించకపోయినా సమస్యలు వస్తాయని నమ్మకం.[35] ఖండోబాను పసుపు, బెల్ పండు-ఆకులు, ఉల్లిపాయలు, ఇతర కూరగాయలతో పూజిస్తారు.[36] ఈ దేవతకు పురాన్ పోలీ అనే మిఠాయి లేదా ఉల్లిపాయలు, వంకాయలతో తయారైన భరిత్ రొద్గా అనే వంటకాన్ని ప్రసాదంగా పెడతారు.[37] ఖండోబా దేవాలయాలలో శాకాహార నైవేద్యాన్ని నివేదిస్తారు. ఐనప్పటికీ అనేకమంది భక్తులు అతనును మాంసాహార నివేదన, మేక మాంసాన్ని దేవాలయ బయట నివేదిస్తారు.[4]
ఖండోబా మతారాథన వ్యవస్థలో నవాస్ (మంచి పంట, మగబిడ్డ, ఆర్థిక పురోభివృద్ధి మొదలైన వరాలు యిచ్చే దానికి బదులుగా దేవునికి సేవ చేయడానికి ఒక ప్రమాణం) అతి ముఖ్యమైనవి. ఈ మొక్కులు తీర్కుకొనుటకు కొంతమంది పిల్లలు లేదా భక్తులు వారి శరీరాకలు నొప్పినిచ్చే కొక్కేలను కట్టుకోవడం లేదా మంటలలోనడవడం వంటివి చేస్తారు.[38] ఈవిధమైన నవాస్ లను "సకమ భక్తి" అంటారు. ఆశతో పూజించే ఇటువంటి ఆరాధన "తక్కువ గౌరవం"గా భావించబడుతుంది.[39] కానీ అత్యంత విశ్వసనీయ భక్తులు తమ దైవంతో కలసి ఉండడాన్ని మాత్రమే అత్యాశగా భావిస్తారు. ఖండోబాను భూకేళ అని కూడా పిలుస్తారు. అటువంటి భక్తులలో మార్తాండ విజయ ఒకరు.[40]
ఖండోబా కోసం పూర్వం అంకితమైన బాలురను వఘ్య ( లేదా అక్షరాలా "పులులు"), బాలికలను మురళి అని పిలుస్తారు. కానీ ప్రస్తుతం ఖండోబాకు బాలికలను వివాహం చేసే వ్యవస్థ అక్రమమైనది.[36] బ్యాగ్యాలు ఖండోబా గాయకులుగానూ, వారికివ్ వారు ఖండోబా యొక్క కుక్కలుగా భావించుకుంటారు. మురళీలు అతను యొక్క వేశ్యలుగా (దేవంగనలు లేదా దేవదాసీలు) గా వ్యవహరించబడతారు. ఈ వ్యాఘ్యాలు, బాలికలైన మురళీలు ఖండోబాను కీర్తిస్తూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. వారు ఖండోబా కథలను జాగరణలలో - పూర్తి రాత్రి పాటలు పాడే పండగలలో పాటల ద్వారా తెలియజేస్తారు.[38] మరొక సంప్రదాయం ఆచారంలో విరాస్ (నాయకులు) చేత కర్మ-ఆత్మహత్యలు చేసుకుంటారు.[41] పురాణం ప్రకారం అంటరానివాడైన మాంగ్ (మాతంగ) జెరూరి వద్ద దేవాలయం యొక్క స్థాపన కొరకు ఖండోబా ఎల్లప్పుడు జెరూరీలో ఉండిపోవాలనే కోరికతో బలిదానం చేస్తాడు.[40]
ఇతర ఆచారాలలో ఖండోబా వ్యాఘ్ర లేదా దేవర్షి శరీరంలోకి ప్రవేశిస్తాడనే నమ్మకం ఉంది.[42][43] మరొక ఆచారంలో ప్రతిజ్ఞ లేదా వార్షిక కుటుంబ ఆచారం నెరవేర్చడానికి గొలుసు-బద్దలు చేసే చర్యగా ఉంది. ఈ గొలుసు శివుని మెడచుట్టూ గల పాముగా భావిస్తారు.[28]
ముస్లిం పూజలు
మార్చుఖండోబాను ముస్లింలు కూడా ఆరాధిస్తారు. ఇది అతని ఆలయాల శైలిలో కూడా ప్రతిబింబిస్తుంది. అతన్ని మల్లు అనీ, ముస్లిం భక్తులలు అజ్మత్ ఖాన్ అనీ పిలుస్తుంటారు. అతన్ని ఈ సందర్భంలో ఒక ముస్లింగా చిత్రీకరిస్తారు.[44] మొఘల్ ఆక్రమణదారుడైన రాజు ఔరంగజేబ్, ఖండోబా అధికారం ద్వారా జెజురి నుంచి పారిపోవాల్సి వచ్చింది.[39] ఈ ప్రత్యేకమైన ముస్లిం లక్షణాలలో కొన్ని అతని గుర్రం వెనుక పాథన్ యొక్క మాదిరిగా కనిపించాయి, అతని భార్యలలో ఒకరు ముస్లిం,, అతని గుర్రపుపనివాడు జెజురిలో ఒక ముస్లిం. తన భక్తులు ప్రధానంగా ముస్లింలు అని మార్తండ విజయ తెలియజేసాడు.
దేవాలయాలు
మార్చుదక్కను ప్రాంతంలో సుమారు 600 దేవాలయాలు ఖండోబాకు అంకితమైనవి.[30] అతని దేవాలయాలు ఉత్తరాన నాసిక్, మహారాష్ట్ర నుండి దక్షిణాన కర్ణాటకలోని థావన్‌గెరే వరకు ఉన్నాయి. పశ్చిమాన మహారాష్ట్రలోని కొంకణ్ నుండి తూర్పున పశ్చిమ ఆంధ్రప్రదేశ్ వరకు ఉన్నాయి.
ఖండోబాను పూజించే 11 నియమాల కేంద్రాలు లేదా జాగ్రుత్ క్షేత్రాలలో దైవాన్ని "జాగ్రుత్" అని పిలుస్తారు. వాటిలో ఆరు మహారాష్ట్రలోనూ మిగిలినవి కర్ణాటక లోనూ ఉన్నాయి.[30][33] ఖండోబా యొక్క ఆలయాలు కోటలను పోలి ఉంటాయి, అతని రాజ్య రాజధాని జెజురి. ఖండోబా అలయాలలోని పూజారులు గురవాస్, బ్రాహ్మణులు కారు.[6] ఖండోబా ముఖ్య దేవాలయాలు:
- జెరూరి: ఖండోబా యొ9క్క మొట్టమొదటి ప్రార్థనా కేంద్రం.[45] ఇది మహారాష్ట్రలోని పూణెక్ ఉ 48 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ రెండు దేవాలయాలున్నాయి. ఇందులో మొదటి ప్రాచీన దేవాలయం కాడేపత్తర్, కాడేపత్తర్ ఎక్కుటకు కష్టంగా ఉంటుంది. రెండవది కొత్తది, ప్రసిద్ధమైన గాడ్-కోట్ దేవాలయం. ఇది ఎక్కుటకు సులువుగా ఉంటుంది. ఈ దేవాలయానికి సూమరు 450 మెట్లు ఉంటాయి.[46]
- పాలీ లేదా పాళి-పెంబెర్, సతారా జిల్లా, మహారాష్ట్ర.[47]
- ఆది-మైలార లేదా ఖనపూర్, బీదర్ వద్ద, కర్ణాటక.
- నల్‌దుర్గ్, ఉస్మానాబాద్ జిల్లా, మహారాష్ట్ర.
- మైలార లింగ, ధవాడ్ జిల్లా, కర్ణాటక.
- మంగసూలి, బెల్గాం జిల్లా, కర్ణాటక.
- మాల్తేష్ లేదా మైలార దేవాలయం, దెవరగుడ్డ, రానేబెన్నూర్ తాలూకా, హవెరీ జిల్లా, కర్ణాటక.
- మన్నమైలార్ లేదా మైలార్, బెల్లరీ, కర్ణాటక. .
- నిమ్‌గాంన్ దవాడి, పూణె జిల్లా, మహారాష్ట్ర.[48]
- షేగుడ్, అహ్మద్ నగర్ జిల్లా, మహారాష్ట్ర.
- కొమరవెల్లి, సిద్దిపేట జిల్లా, తెలంగాణ.
- సతారే, ఔరంగాబాద్ జిల్లా, మహారాష్ట్ర.
- మైలరలింగేశ్వర దేవాలయం - మైలాపూర్, యాదగిరి జిల్లా, కర్ణాటక
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 Singh p.ix
- ↑ Sontheimer in Hiltebeitel p.314
- ↑ Sontheimer in Feldhaus p.115
- ↑ 4.0 4.1 Stanley in Hiltebeitel p.284
- ↑ Stanley in Hiltebeitel p.288
- ↑ 6.0 6.1 Sontheimer in Hiltebeitel p.303
- ↑ 7.0 7.1 Stanley (Nov. 1977) p. 32
- ↑ For worship of Khandoba in the form of a lingam and possible identification with Shiva based on that, see: Mate, p. 176.
- ↑ Sontheimer in Bakker p.103
- ↑ Sontheimer in Bakker pp.105-6
- ↑ Sontheimer in Bakker p.105
- ↑ Sontheimer in Hiltebeitel p.330
- ↑ Stanley in Hiltebeitel pp. 272,293
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-11-01. Retrieved 2018-03-11.
- ↑ Sontheimer in Bakker p.118
- ↑ Stanley in Hiltebeitel pp.272-77
- ↑ For a detailed synopsis of Malhari Mahtmya, see Sontheimer in Bakker pp.116-26
- ↑ Sontheimer in Hiltebeitel p.328
- ↑ Sontheimer in Feldhaus p.116
- ↑ Sontheimer in Feldhaus p.117-8
- ↑ Sontheimer in Hiltebeitel p. 300
- ↑ Sontheimer in Hiltebeitel p.332
- ↑ Sontheimer in Bakker p.110
- ↑ 24.0 24.1 Stanley (Nov. 1977) p. 33
- ↑ 25.0 25.1 Sontheimer in Bakker p.113
- ↑ For use of the name Khandoba as a name for Karttikeya in Maharashtra, Gupta Preface, and p. 40.
- ↑ Khokar, Mohan (June 25, 2000). "In recognition of valour". The Hindu. Archived from the original on 2009-02-03. Retrieved 2008-10-13.
- ↑ 28.0 28.1 Sontheimer in Bakker p.114
- ↑ Pillai, S Devadas (1997). Indian Sociology Through Ghurye, a Dictionary. Mumbai: Popular Prakashan. pp. 190–192. ISBN 81-7154-807-5.
- ↑ 30.0 30.1 30.2 30.3 Stanley (Nov. 1977) p. 31
- ↑ Rathod, Motiraj (November 2000). "Denotified and Nomadic Tribes in Maharashtra". The Denotified and Nomatic Tribes Rights Action Group Newsletter (April–June and July–September, 2000). DNT Rights Action Group. Archived from the original on 2009-02-05.
- ↑ Singh, K S (2004). People of India: Maharashtra. Popular Prakashan and Anthropological Survey of India. p. 1768.
- ↑ 33.0 33.1 Stanley in Hiltebeitel p.271
- ↑ "Ahmadnagar District Gazetteer: People". Maharashtra State Gazetteer. 2006 [1976]. Archived from the original on 7 అక్టోబరు 2011. Retrieved 11 September 2010.
- ↑ Sontheimer in Hiltebeitel pp.332-3
- ↑ 36.0 36.1 Underhill p.111
- ↑ Stanley in Hiltebeitel p.296
- ↑ 38.0 38.1 Stanley in Hiltebeitel p.293
- ↑ 39.0 39.1 Burman p.1227
- ↑ 40.0 40.1 Sontheimer in Hiltebeitel p.313
- ↑ Sontheimer in Hiltebeitel p.308
- ↑ Sontheimer in Hiltebeitel p.302
- ↑ See Stanley in Zelliot pp. 40-53: for details of possession beliefs: Angat Yene:Possession by the Divine
- ↑ Sontheimer in Hiltebeitel pp. 325-7
- ↑ For Jejuri as the foremost center of worship see: Mate, p. 162.
- ↑ "Jejuri". Maharashtra Gazetteer. 2006 [1885].[permanent dead link]
- ↑ "PAL OR RAJAPUR". Satara District Gazzeteer. Archived from the original on 18 ఏప్రిల్ 2011. Retrieved 11 మార్చి 2018.
- ↑ Nimgaon
ఇతర పఠనాలు
మార్చు- Burman, J. J. Roy (Apr 14–20, 2001). "Shivaji's Myth and Maharashtra's Syncretic Traditions". Economic and Political Weekly. 36 (14/15): 1226–1234. JSTOR 4410485.
- Gupta, Shakti M. (1988). Karttikeya: The Son of Shiva. Bombay: Somaiya Publications Pvt. Ltd. ISBN 81-7039-186-5.
- Mate, M. S. (1988). Temples and Legends of Maharashtra. Bombay: Bharatiya Vidya Bhavan.
- Singh, Kumar Suresh; B. V. Bhanu (2004). People of India. Anthropological Survey of India. ISBN 978-81-7991-101-3.
- Sontheimer, Günther-Dietz (1989). "Between Ghost and God: Folk Deity of the Deccan". In Alf Hiltebeitel (ed.). Criminal Gods and Demon Devotees: Essays on the Guardians of Popular Hinduism. SUNY Press. ISBN 0-88706-981-9.
- Sontheimer, Günther-Dietz (1990). "God as King for All: The Sanskrit Malhari Mahatmya and its context". In Hans Bakker (ed.). The History of Sacred Places in India as Reflected in Traditional Literature. BRILL. ISBN 90-04-09318-4.
- Sontheimer, Günther-Dietz (1996). "All the God's wives". In Anne Feldhaus (ed.). Images of Women in Maharashtrian Literature and Religion. SUNY Press. ISBN 0-7914-2837-0.
- Stanley, John M. (Nov 1977). "Special Time, Special Power: The Fluidity of Power in a Popular Hindu Festival". The Journal of Asian Studies. 37 (1). Association for Asian Studies: 27–43. doi:10.2307/2053326. JSTOR 2053326.
- Stanley, John. M. (1988). "Gods, Ghosts and Possession". In Eleanor Zelliot, Maxine Berntsen (ed.). The Experience of Hinduism.
- Stanley, John. M. (1989). "The Captulation of Mani: A Conversion Myth in the Cult of Khandoba". In Alf Hiltebeitel (ed.). Criminal Gods and Demon Devotees: Essays on the Guardians of Popular Hinduism. SUNY Press. ISBN 0-88706-981-9.
- Underhill, Muriel Marion (1991). The Hindu Religious Year. Asian Educational Services. ISBN 81-206-0523-3.