జంతువులలోని 30 వర్గాలలో కార్డేటా (లాటిన్ Chordata) వర్గం చివరిది. కార్డేటా వర్గాన్ని బాల్ ఫోర్ 1880 లో స్థాపించారు. కార్డేటా అంటే గ్రీకు భాషలో తీగవంటి నిర్మాణం కలిగి ఉండటం అని అర్థం. ఈ తీగలాంటి భాగం కార్డేటా జీవులలో గల, స్థితిస్థాపక శక్తి కలిగి దృఢమైన ఆధారాన్నిచ్చే పృష్ట వంశం. ఈ వర్గంలో గల జీవులన్నిటిలో ఏదో ఒక దశలో ఉంది.

కార్డేటా
Temporal range: Latest Ediacaran - Recent
Scientific classification
Domain:
Kingdom:
Subkingdom:
Superphylum:
(unranked):
Phylum:
కార్డేటా

Typical Classes

See below

కార్డేటా

సామాన్య లక్షణాలు

మార్చు
  • పృష్ఠవంశం (Chorda dorsalis) : ఇది పృష్ఠ భాగంలోగల దృఢమైన స్థితిస్థాపక శక్తి కలిగిన కడ్డీ వంటి నిర్మాణం. ఇది పిండదశలో మధ్యత్వచం నుంచి ఏర్పడుతుంది. ఆంఫియాక్సిస్, ఆయికోఫ్లూరా ల వంటి ప్రాథమిక కార్డేటా లలో పృష్ఠవంశం జీవిత పర్యంతం కనిపిస్తుంది. అభివృద్ధి చెందిన సకశేరుకాలలో ఇది పిండదశకే పరిమితమై, ప్రౌఢజీవులలో వెన్నెముకగా మారుతుంది. ప్రౌఢ క్షీరదాలలో పృష్ఠవంశం అంతర్ కశేరు చక్రికలపై మందమైన 'న్యూక్లియై పల్పోసిస్' గా కనిపిస్తుంది.
  • నాళికాయుత పృష్ఠ నాడీ దండం: కార్డేటాలలో నాడీ దండం పృష్ఠ తలంలో బోలుగా గల నిర్మాణం. కానీ అకశేరుకాలలో నాడీ దండం ఉదరతలంలో రెండు నాడీ దండాలను కలిగిన ఘన నిర్మాణం. నాడీదండం బహిస్త్వచం నుంచి ఏర్పడుతుంది. ఇది పూర్వతలంలో మెదడుగాను, పరభాగంలో కశేరు నాడీ దండంగాను మారుతుంది. నాడీ దండం శరీర ప్రక్రియలను సమన్వయపరుస్తూ క్రమబద్ధం చేస్తుంది.
  • గ్రసనీ మొప్పచీలికలు (Bronchial clefts) : కింది స్థాయి జలచర కార్డేట్ లలో గ్రసనీ కుహరం నీటి ప్రవాహం వెళ్ళేందుకనుకూలంగా గ్రసనీకుడ్యం జతలగా మొప్ప చీలికలను కలిగి ఉంటుంది. ఈ గ్రసని మొప్ప చీలికలు ప్రోకార్డేట్ లు, చేపలు, ఉభయచరాలు డింభకాలలోను శాశ్వతంగా ఉంటాయి. నీటి నుంచి భూచర జీవితానికి మారినప్పుడు మొప్ప చీలికల విధిని ఊపిరితిత్తులు నిర్వహిస్తాయి. అందువల్ల భూచరజీవులలో మొప్ప చీలికలు అవశేషావయవాలుగా మారి, విధిని కోల్పోయి, పిండదశకు మాత్రమే పరిమితమవుతాయి.
  • సౌష్ఠవం (Symmetry) : కార్డేట్ జీవులు ఇతర సీలోమేట్ వర్గాలైన అనెలిడా, ఆర్థోపొడలలాగ ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని చూపిస్తాయి.
  • ఖండీ భవనం (Metamerism) : కార్డేట్ జీవులలో అంతర్ ఖండవిన్యాసం, కండరాలు, కశేరువుల అమరికలో విదితమవుతుంది.
  • శరీరకుహరం (Coelom) : ఎకినోడెర్మేటా జీవుల లాగ కార్డేట్ లలో ఆంత్ర శరీర కుహరం ఉంటుంది.
  • అస్థిపంజరం (Skeleton) : శరీర భాగాల కదలికకు ఉపయోగపడుతుంది. చాలా కార్డేట్ లలో అంతరాస్థిపంజరం ఎముక లేదా మృదులాస్థి నిర్మితం.
  • హృదయం (Heart) : కార్డేట్ లలో రక్తప్రసరణను క్రమబద్దం చేసేది గుండె. ఇది ఉదరతలంలో ఉండే కండర జనిత హృదయం. ఈ జీవులలో నాన్-కార్డేట్ లలో లాగ కాకుండా పృష్ఠ రక్తనాళాలలో రక్తప్రసరణ పూర్వభాగం నుంచి పరభాగానికి, ఉదర రక్తనాళాలలో పరభాగం నుంచి పూర్వభాగానికి జరుగుతుంది.
  • కాలేయ నిర్వాహక సిర (Hepatic portal vein) : అమైనో ఆమ్లాలు, గ్లూకోస్ కలిగిన జీర్ణమైన ఆహారాన్ని జీర్ణనాళం నుంచి గ్రహించి, కేశనాళికల ద్వారా కాలేయం లోకి తెరచుకొనే రక్తనాళం కాలేయ నిర్వాహిక సిర.
  • కండర ఫాస్ఫోజన్ : కార్డేట్ లలో గల కండర ఫాస్ఫోజన్ - క్రియాటిన్ ఫాస్ఫేట్.
  • పాయు పర పుచ్ఛవాజం (Post anal tail) : శరీర పరభాగం నుంచి ఏర్పడే నిర్మాణాన్ని తోక అంటారు. తోకలో శరీర కుహరంగాని అంతరంగాలు గాని ఉండవు. కానీ కండరాలు, నాడీ దండం, పృష్ఠవంశం ఉంటాయి. తోక కార్డేటా జీవులలో పాయువుకు పరాంతంగా ఉంటుంది.
  • ఆది ఆంత్రరంధ్రం (Blastopore) : గాస్ట్రాలేషన్ సమయంలో ఏర్పడే ఆది ఆంత్రరంధ్రం కార్డేట్ లలో పాయువుగా మారుతుంది. ఈ స్థితిని 'డ్యూటిరోస్టోమియేట్ స్థితి' అంటారు.

వర్గీకరణ

మార్చు