కణ విభజన అనేది ఒక మాతృ జీవకణం రెండు కణాలుగా విడిపోయే జీవ ప్రక్రియ.[1] కణ విభజన సాధారణంగా ఒక పెద్ద కణ చక్రంలో భాగంగా జరుగుతుంది. ఈప్రక్రియలో కణం పెరుగుతూ, విభజనకు ముందు దాని క్రోమోజోముల ప్రతిరూపాలు తయారు చేస్తుంది.

కేంద్రకపూర్వ జీవులలో కణ విభజన (రెండుగా విభజన), కేంద్రకయుత జీవి (సమసూత్రణ, క్షయకరణ విభజన). మందంగా ఉండే గీతలు క్రోమోజోములు. సన్నగా నీలంగా రంగులో ఉండే రేఖలు క్రోమోజోములను లాగుతూ కణాల చివర భాగాన్న నెడుతూ ఉన్నాయి.

జీవుల పెరుగుదలకూ, తనను తాను బాగు చేసుకోవడానికీ, ప్రత్యుత్పత్తికీ ఈ ప్రక్రియ కీలకమైనది.

రకాలు

మార్చు

కణ విభజన ప్రధానంగా రెండు రకాలు. ఒకటి సమసూత్రణ (మైటోసిస్), రెండు క్షయకరణ విభజన (మీయోసిస్).[2] ఇందులో సమసూత్రణ అనేది సర్వసాధారణమైనది. దీని వల్ల పెరుగుదల, బాగు చేసుకోవడం వీలవుతుంది. సమసూత్రణలో ఒక మాతృ కణం రెండు అదే రకమైన కణాలుగా విడిపోతుంది. దాని డిఎన్‌ఎ ని నకలు తీసి రెండింటికీ ఇస్తుంది. విడిపోయిన రెండు కణాలలో క్రోమోజోములు ఒకే సంఖ్యలో ఉంటాయి. దీనివల్ల జీవుల పరిమాణం పెరుగుతుంది. చెడిపోయిన కణాల స్థానంలో కొత్తవి వస్తాయి. గాయాలు నయం అవుతాయి.

క్షయకరణ విభజన లైంగిక జననానికి కారణమవుతుంది. ఇది ముందు దానితో పోలిస్తే కొంచెం క్లిష్టమైన ప్రక్రియ. ఇందులో కణం రెండు సార్లు విభజనకు గురవుతుంది. నాలుగు బీజ కణాలు (శుక్రకణాలు, అండాలు) ఉత్పత్తి అవుతాయి. ఒక్కో కణంలో మాతృకణంలో సగం క్రోమోజోములు ఉంటాయి. ఈ బీజ కణాలు శుక్రకణం, అండం గర్భోత్పాదన ద్వారా కలిసి సరికొత్త జన్యువుల ఏర్పాటుతో వివిధరకాలైన జీవులను ఉత్పత్తి చేస్తాయి.

మూలాలు

మార్చు
  1. Martin EA, Hine R (2020). A dictionary of biology (6th ed.). Oxford: Oxford University Press. ISBN 9780199204625. OCLC 176818780.
  2. Griffiths AJ (2012). Introduction to genetic analysis (10th ed.). New York: W.H. Freeman and Co. ISBN 9781429229432. OCLC 698085201.